27 పథకాలను తొలగించారు వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్..!!

ఈరోజు ఉదయం విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై వారాహికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం తెలిసిందే.

అనంతరం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పవన్ పాల్గొనడం జరిగింది.

ఈ సమావేశంలో వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జీవితంలో ప్రతి సమయంలో మనిషి ఏదో ఓ వివక్షకు గురవుతాడని పవన్ చెప్పుకొచ్చారు.

తాను కూడా విమానంలో వివక్షకు గురికావడం జరిగిందని తెలిపారు.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకూడదని పవన్ హెచ్చరించారు.

బయట ఉండే శత్రువుల కంటే మనతో ఉండే శత్రువుతో ఉన్న చాలా ప్రమాదం ఎక్కువ అని చెప్పుకోచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేసారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ అన్నారు.

Advertisement

మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేననీ పేర్కొన్నారు.ఈ మూడు సంవత్సరాల లో ఎస్సీ, ఎస్టీలకు రావలసిన 20వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలి అని వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పబ్లిసిటీ కోసం 15 వేల కోట్లు ఖర్చు చేసిందని.

వైసీపీ రంగుల కోసం 21 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు