ఆ పాట విషయంలో నాకు పవన్ కళ్యాణ్ దైర్యం.. కోట ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన తెలుగు సినిమాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు.

హీరోలకు తండ్రి గా, తాతయ్య క్యారెక్టర్ లలో కూడా నటించాడు.తాజాగా కోట పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ సినిమాలో కోటశ్రీనివాస రావు మందు బాబులం అనే సాంగ్ పాట పాడిన విషయం తెలిసిందే.

అయితే ఆ సాంగ్ పాడటానికి ధైర్యాన్నిచ్చింది పవన్ కళ్యాణే అని అంటున్నారు.గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఆ పాటను మీరు పాడండి బాబాయ్ అని  హరీష్ శంకర్ కోట శ్రీనివాసరావు తో అన్నాడట.

Advertisement
Pawan Kalyan Is My Strength In That Song Kota Interesting Comments Details, Paw

కానీ అందుకు కోట శ్రీనివాసరావు ఒప్పుకోలేదట.కానీ వాళ్లు మాత్రం పట్టుబట్టి మరీ అతడితో రూమ్ లోకి తీసుకెళ్లి మరి హెడ్ఫోన్స్ పెట్టి అక్కడ నిలబడి మరి ఒక్కొక్క లైన్లో పాడించారు అని చెప్పుకొచ్చారు కోట.మొదట దేవిశ్రీప్రసాద్ పాడటం ఆ తర్వాత కోట పాడటం అలా నేను పాడుతున్న క్రమంలోనే పాటను నాకు తెలియకుండా రికార్డ్ చేశారు రికార్డింగ్ పూర్తి అయింది అన్నారు.పాట పూర్తి అయిన తర్వాత అతని చెవిలో హెడ్ ఫోన్ తీసేస్తూ చూడండి బాబాయ్ , ఈ పాట ఎంత ట్రెండ్ క్రియేట్ చేసిందో అని దేవిశ్రీప్రసాద్ అన్నారట.

Pawan Kalyan Is My Strength In That Song Kota Interesting Comments Details, Paw

ఆ పాట పాడి బయటకు వచ్చిన తర్వాత కోట కి కీరవాణి గారు కనిపించి ఏంటి కోట గారు రికార్డింగ్ స్టూడియో కి వచ్చారు అని  పలకరించారట.కీరవాణి కూడా మీరు పాడితే బాగానే ఉందండి అని చెప్పారట.దేవిశ్రీప్రసాద్ ఏది కూడా ఊరికే చేయడు.

చేసాడు అంటే విషయం ఉండే ఉంటుంది అని కీరవాణి తెలిపారట.కీరవాణి ని చూడగానే దేవిశ్రీప్రసాద్ నమస్కరించి కోట పాడిన పాటను వినిపించారట.

ఆ పాట విన్న తర్వాత కీరవాణి, కోట గారు ప్రజల్లోకి వెళ్లి చూడండి అంటూ పాజిటివ్ గా స్పందించారు.అయితే మొదటి నుంచి ఆ పాట ఈ విషయంలో కోట కి ధైర్యం చెప్పింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకొచ్చారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు