ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాక్ షోల హవా బాగానే నడుస్తోంది.
ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన టాక్ షో లన్నింటికి కూడా ప్రత్యేక ప్రేక్షకాదరణ దక్కింది.
ప్రేక్షకులు కూడా ఎన్ని టాక్ షో లు వచ్చినా కూడా అన్నింటిని ఆదరిస్తూ ఆ షో లను మరింత విజయవంతం చేస్తున్నారు.అయితే ఇదివరకు ఈ టాక్ షోలకు కేవలం చిన్న చిన్న సెలబ్రిటీలు,బుల్లితెర సెలబ్రిటీలు మాత్రమే ఎంట్రీ ఇచ్చేవారు.
కానీ రాను రాను చిన్న చిన్న సెలబ్రిటీలు మాత్రమే కాకుండా అగ్ర హీరోలు రాజకీయ నాయకులు కూడా ఈ టాక్ షోలలో కనిపిస్తున్నారు.అలా టాలీవుడ్ అగ్ర హీరో అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొనబోతున్నట్లు కమెడియన్ ఆలీ క్లారిటీ ఇచ్చారు.కాగా బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైన విషయం అందరికీ తెలిసిందే.
ఆ ఎపిసోడ్ ప్రత్యేకంగా హైలెట్ గా కూడా నిలిచింది.ఆ తరువాత బాలయ్య బాబు షోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ జోరుగా వార్తలు వినిపించాయి.
కానీ అందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఆలీతో సరదాగా షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నట్లు క్లారిటీ కూడా వచ్చేసింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ ఈ విషయంపై స్పందిస్తూ.ఆయన ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు కచ్చితంగా మా షోకి వస్తారు వస్తానని చెప్పారు త్వరలోనే మా షోకి పవన్ కళ్యాణ్ గారు వస్తారు అంటూ ఆలీ కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆ పవన్ కళ్యాణ్ అలీ ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ అలీ మధ్య ఉన్న రిలేషన్ గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ తో పాటు అలీ ఎన్నో సినిమాలలో నటించాడు.వీరిద్దరి కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
కాగా ఈ వార్తలపై స్పందించిన నెటిజన్స్ నీ పని బాగుందయ్యా అలీ రాజకీయాలేమో జగన్ తో, ఇంటర్వ్యూలేమో పవన్ కళ్యాణ్ తో నా అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.మరి కొందరు మాత్రం ఆ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కానుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy