పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత ఇటీవలే పవన్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.
ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.ఇందులో రానా కూడా ప్రధాన పాత్రలో నటించాడు.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అందులో హరి హర వీరమల్లు సినిమా ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యి వేగంగా షూట్ జరుపు కుంటుంది.
అయితే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయాల్సి ఉంది.ఈయన ఇంతకు ముందే పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.
దీంతో పవన్ హరీష్ శంకర్ కు మరోసారి అవకాశం ఇచ్చాడు.భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను కూడా ప్రకటించాడు.
అలాగే ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసాడు.అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయం పై గత రెండు రోజులుగా మరిన్ని రూమర్స్ వస్తున్నాయి.ఇటీవలే హరీష్ శంకర్ గత కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ ను మీట్ అయినా విషయం తెలిసిందే.
దీంతో ఆయన హిందీ సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.ఇక పవన్ కూడా మరో రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
మరి వీరిద్దరూ వేర్వేరు సినిమాలు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది అంటూ ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.అయితే ఈ వార్తల్లో నిజం లేదని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవడంతో ఈ ప్రచారానికి తెర పడింది.వీరమల్లు సినిమా వల్లనే ఆలస్యం అవుతుందని ఇది పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy