దసరా బరిలో పవర్ స్టార్.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.

ఎం.రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు.

పీరియాడికల్ మూవీగా రాబోతున్న హరి హర వీరమల్లు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు.సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.షూటింగ్ కి కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ త్వరలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

Advertisement

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని దసరా కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.దసరా బరిలో అక్టోబర్ 5న హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంటుందని టాక్.

సినిమా నుండి ఇప్పటికే రిలీజైన టీజర్ అంచనాలు పెంచగా హరి హర వీరమల్లు సినిమా తపకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు.  ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో భగదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

Advertisement

తాజా వార్తలు