కొత్త పార్టీతో ప‌వ‌న్ పొత్తు..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీకి దిగుతోన్న ప‌వ‌న్ అప్పుడే త‌న ఒక్క‌డి వ‌ల్ల అధికార ప‌క్షాల‌ను ఢీకొట్ట‌డం సాధ్య‌ప‌డ‌ద‌ని అప్పుడే పొత్తుల‌కు రెడీ అవుతున్నాడు.

ఏపీలో ప‌వ‌న్ కామ్రేడ్ల‌తో జ‌ట్టుక‌ట్టే సూచ‌న‌లు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తోంది.

ఇక ప‌వ‌న్ లాంటి వాళ్ల‌తో జ‌ట్టు క‌ట్టేందుకు వైసీపీ లాంటి ప్ర‌ధాన పార్టీలు సైతం వేచి చూస్తున్నాయి.ప‌వ‌న్ పొత్తు పెట్టుకుంటానంటే టీడీపీ, బీజేపీ సైతం కాద‌న‌లేని ప‌రిస్థితి.

ఏపీలో ప‌వ‌న్ క్రేజ్ అలాంటిది.ఇక తెలంగాణ‌లో మాత్రం అధికార టీఆర్ఎస్ దూకుడు ముందు విప‌క్షాల‌న్ని ఆగ‌లేక‌పోతున్నాయి.

ఈ క్ర‌మంలోనే అక్క‌డ విప‌క్షాల‌న్ని క‌లిసి కేసీఆర్‌కు యాంటీగా జ‌ట్టుక‌డ‌తాయ‌న్న టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఇదిలా ఉంటే ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం లాంటి వాళ్లు సైతం కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు చేతులు క‌లుపుతున్నార‌న్న వార్త‌లూ మ‌రో వైపు వ‌స్తున్నాయి.

Advertisement

ఇక కొత్త‌గా అక్క‌డ పోటీకి రెడీ అవుతోన్న జ‌న‌సేనపై తెలంగాణ‌లో నిన్న‌టి వ‌ర‌కు పెద్ద‌గా అంచ‌నాలు లేవు.అక్క‌డ జ‌న‌సేన ఎంపిక‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుండ‌డంతో పార్టీ అధినేత ప‌వ‌న్ సైతం ఉత్సాహంతో ఉన్నారు.

ఇక ఇప్పుడు జ‌న‌సేనతో పొత్తుకు ఓ కొత్త పార్టీ సంకేతాలు పంపుతోంది.మాజీ టీఆర్ఎస్ నేత చెర‌కు సుధాక‌ర్ తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు.

ఈ పార్టీ ఉపాధ్య‌క్షుడిగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే య‌న్నం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.ఈ పార్టీలో వీరిద్ద‌రికి తోడు ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ సైతం చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రి గ‌ద్ద‌ర్‌-ప‌వ‌న్‌కు మ‌ధ్య ఎంతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి.వీరిద్ద‌రు క‌లిసి ప‌నిచేస్తార‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

మ‌రి ఇప్పుడు గ‌ద్ద‌ర్ ద్వారా తెలంగాణ ఇంటి పార్టీ + జ‌న‌సేన అక్క‌డ పొత్తు పెట్టుకునే ఛాన్సులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఈ కూట‌మికి ప్రొఫెస‌ర్ కోదండ‌రాం క‌లిస్తే టీఆర్ఎస్ జోరుగా కొంత బ్రేకులు ప‌డుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు