2019లో ప‌వ‌న్ కూట‌మిలో పార్టీలు ఇవేనా..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి రాజకీయ కదలిక ఏపీ పాలిటిక్స్‌లో ఆస‌క్తి రేపుతోంది.ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది.

ప‌వ‌న్ ఏలూరులో ఓటు హ‌క్కు న‌మోదు చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.ఇక తాడేప‌ల్లిగూడెం లేదా పాల‌కొల్లులో ఎక్క‌డో ఓ చోట నుంచి పోటీ చేయ‌డం కూడా ఖ‌రారైన‌ట్టే తెలుస్తోంది.

ఏపీలో ప్ర‌త్యేక హోదా - ఉద్దానం కిడ్ని సమస్య - అమరావతి, పోలవరం భూసేకరణ వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లారు.ఇక ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌లో ఉన్న ప‌వ‌న్ ఎన్నారైల‌తో కూడా ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తున్నాడు.

ఇదిలా ఉంటే 2019లో ప‌వ‌న్ ఒంట‌రిగా బ‌రిలో ఉండ‌డం కంటే భావ‌సారూప్య‌త ఉన్న కొన్ని పార్టీల‌ను క‌లుపుకుని ఓ కూట‌మి ఏర్పాటు చేసే ఛాన్సులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.ప‌వ‌న్ ఇప్ప‌టికిప్పుడు ఈ అంశంపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్‌కు ఓ ప్ర‌శ్న ఎదురైంది.

Advertisement

ఆమ్ ఆద్మీ పార్టీతో (ఆప్‌) పొత్తు పెట్టుకుంటారా ? అని ప్ర‌శ్నిస్తే దాని గురించి తాను ఆలోచించ‌డం లేద‌ని చెప్పారు.ఇక గ‌తంలో కూడా క‌మ్యూనిస్టులు ప‌వ‌న్‌తో క‌లిసి న‌డిచేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.

అటూ క‌మ్యూనిస్టుల‌తో పాటు ఆప్‌తో జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే అది ఖ‌చ్చితంగా మంచికూట‌మి అవ్వ‌డంతో పాటు టీడీపీ-వైసీపీల‌కు గ‌ట్టి పోటీ ఇస్తుంద‌న్న చ‌ర్చ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో ఎలాగూ వైసీపీతో క‌ల‌వ‌డు.

ఇక బీజేపీ+టీడీపీ కూట‌మి ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదు.దీంతో ఈ కూట‌మికి కూడా దూరం కానున్నాడు.

సో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటు బ్యాంకు ఉన్న క‌మ్యూనిస్టుల‌తో పాటు ప‌వ‌న్ క్రేజ్ కూట‌మికి కీల‌కం కానుంది.ఇక ఆప్‌కు ఏపీలో బ‌లం లేక‌పోయినా ప‌వ‌న్ లాంటి వ్య‌క్తుల‌తో న‌డిచేందుకు కేజ్రీవాల్ సైతం అంగీక‌రిచ‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు