సైలంట్ గా కానిచ్చేస్తున్న హరి హర వీరమల్లు

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్‌ వకీల్‌ సాబ్‌ మరియు భీమ్లా నాయక్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు.

ఈ రెండు సినిమా ల సక్సెస్ తర్వాత పవన్‌ నుండి రాబోతున్న సినిమా హరి హర వీరమల్లు.

ఈ సినిమా షూటింగ్‌ మొన్నటి వరకు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.షూటింగ్‌ ప్రారంభం అయ్యి ఏడాదిన్నర అవుతున్నా కూడా ఇంకా పూర్తి కాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.

ఎట్టకేలకు సినిమాను ముగించేందుకు క్రిష్ పట్టం కట్టుకున్నాడు.ఇటీవలే సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

భారీ యాక్షన్ సన్నివేశంను పవన్ పై చిత్రీకరించారు.పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం తో పాటు వీఎఫ్‌ ఎక్స్ కు కూడా కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

ఇక సినిమా షూటింగ్‌ వివరాలకు వస్తే సినిమాను మెల్ల మెల్లగా ఇన్నాళ్లు షూట్‌ చేస్తూ వచ్చిన క్రిష్ గత రెండు వారాలుగా ఏమాత్రం బ్రేక్ లేకుండా పవన్ ఉన్నప్పుడు ఆయన కాంబో సన్నివేశాలు.లేని సమయంలో ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు.

పవన్‌ కళ్యాణ్ డే అండ్‌ నైట్‌ అనే తేడా లేకుండా హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు అంటూ అభిమానులకు యూనిట్‌ సభ్యులు తెలియజేస్తున్నారు.ఈ సినిమాలో పవన్‌ కు జోడీగా నిధి అగర్వాల్‌ నటించింది.

ఆమె మాత్రమే కాకుండా బాలీవుడ్‌ కు చెందిన ఒక స్టార్‌ హీరోయిన్‌ హరి హర వీరమల్లు సినిమాలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా వచ్చే ఏడాది లో విడుదల అవుతుందని.

లేదు ఇదే ఏడాదిలో విడుదల అవుతుందనే చర్చ జరుగుతుంది.అసలు విషయం ఏంటో తెలియాల్సి ఉంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement