తెలంగాణలో పవన్ ఎఫెక్ట్.. ఎవరిపై ?

ఏపీలో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ( Janasena party ) తెలంగాణలో సత్తా చాటెందుకు సిద్దమౌతోంది.

గత ఎన్నికల టైమ్ లో తెలంగాణను లైట్ తీసుకున్న పవన్ ఈసారి మాత్రం తెలంగాణ విషయంలో తగ్గేదెలే అంటూ ముందుకు సాగుతున్నారు.

ఏపీ కంటే ముందే తెలంగాణ ఎన్నికలు జరుతుండడంతో ఈసారి తెలంగాణలో బరిలో దిగాలని పవన్ భావిస్తున్నారు.అయితే మొదట తెలంగాణలో పోటీ చేయడంపై ఆచితూచి స్పందిస్తూ వచ్చిన పవన్.

ఈ మద్య మాత్రం తెలంగాణలో పోటీపై స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నారు.కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయబోతుందని ప్రకటించి ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచారు.

దీంతో పవన్ ( Pawan Kalyan )ఎంట్రీ తెలంగాణలో ఏ పార్టీపై ఎక్కువగా ఉండబోతుందనే చర్చ జోరందుకుంది.

Advertisement

ఇప్పటికే అధికారం కోసం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ( BRS Congress BJP ) మద్య మూకుమ్మడి పోటీ నడుస్తోంది.అధికారం మాదంటే మాది అంటూ మూడు పార్టీలా నేతలు జబ్బలు చరుస్తున్నారు.ఇక ఇప్పుడు జనసేన కూడా ఎంట్రీ ఇవ్వడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

అయితే ఏపీలో జనసేన పార్టీ టీడీపీ మరియు బీజేపీ లతో పొత్తులో ఉంది.మరి తెలంగాణ విషయంలో కూడా ఈ పొత్తు కొనసాగుతుందా అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

అయితే ఆ రెండు పార్టీలతో పొత్తు తెలంగాణలో కూడా కొనసాగితే జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఒకవేళ సింగిల్ గా బరిలోకి దిగితే అధికార బి‌ఆర్‌ఎస్ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఒకవేళ బీజేపీ మరియు టీడీపీ పొత్తును తెలంగాణలో కూడా కొనసాగితే బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా జనసేన వైపు కాకుండా బి‌ఆర్‌ఎస్ వైపు తిరిగే అవకాశం ఉంది.అయితే బి‌ఆర్‌ఎస్ నేతలలోని కే‌టి‌ఆర్( KTR ), కే‌సి‌ఆర్ లతో పవన్ ( Pawan Kalyan ) కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

అందువల్ల చివరికి బి‌ఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట.మొత్తానికి తెలంగాణలో జనసేన ఎంట్రీ ఇవ్వడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు