ఆ రెండు వ‌ర్గాల‌ను న‌మ్ముకుంటున్న ప‌వ‌న్‌.. ఫ‌లిస్తుందా..?

ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు స‌రికొత్త స్ట్రీట‌జీతో ముందుకు వెళ్తున్నారు.

అస‌లు ఏపీలో ఎవ‌రైనా కొత్త శ‌క్తిగా ఎదుగుతార‌నే న‌మ్మకం ప్ర‌జ‌ల‌కు ఉందా అది కేవ‌లం ప‌వ‌న్ మీద మాత్ర‌మే.

ఎందుకంటే ఎలాగూ టీడీపీ, వైసీపీల‌కు ఇప్ప‌టికే ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చేశారు.ఇక వీరి త‌ర్వాత బ‌ల‌మైన పార్టీగా ఉన్న జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు ఎంతో కొంత అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ లేక‌పోలేదు.

అందుకే వారి న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచేలా ప‌వ‌న్ కూడా ఈ మ‌ధ్య దూకుడు పెంచేస్తున్నారు.ఎలాగైనా రాబోయే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పోటీ చేసి గ‌ట్టి మెజార్టీని ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు.

తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మొద‌ట్లో ఎలాంటి కుల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్ప‌డం కొంత మైన‌స్గా మారింద‌ని ఆయ‌న గుర్తించారు కావ‌చ్చు.అందుకే ఈ మ‌ధ్య త‌న స‌హ‌జ సిద్ధాంతాల‌ను ప‌క్క‌న పెట్టేసి అన్ని పార్టీల మాదిరిగానే రాజ‌కీయాల్లో రాణించేందుకు రెడీ అయిపోయారు.

Advertisement
Pawan Believes In Those Two Categories Will It Work, Pawan Kalyan, Ap Politics,

అందుకే ఈ మ‌ధ్య కులాల ప్ర‌స్తావ‌న తీసుకువ‌స్తున్నారు.ప్ర‌జ‌ల‌ను సామాజిక వ‌ర్గాలుగా విభ‌జించి ఆక‌ట్టుకునేందుకు బాగానే ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు.

కాగా ఇందులో భాగంగానే ఈ మ‌ధ్య కాపుల ప్ర‌స్తావ‌న బాగా ఎత్తుకుంటున్నారు.తాను కూడా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం ఇక్క విశేషం.

Pawan Believes In Those Two Categories Will It Work, Pawan Kalyan, Ap Politics,

అయితే మొన్న ఓసారి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి అండ‌గా ఉంటాన‌ని కూడా చెప్ప‌డంతో ఆ వ‌ర్గాన్ని కూడా ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు.ఇప్పుడు బీసీల మీద ప‌వ‌న్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.ఇన్ని రోజులు అటు టీడీపీతో పాటు వైసీపీ కూడా ఈ వ‌ర్గాల‌ను ఆధారంగా చేసుకునే అధికారంలోకి వ‌చ్చాయి.

దాంతో ఇప్పుడు ఆ వ‌ర్గాన్ని ప‌వ‌న్ త‌న‌వైపు తిప్పుకునేందుకు రెడీ అయిపోయారు.ఏపీలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులతో పాటు బీసీల‌ను క‌లుపుకుని పోతే త‌నకు అధికారం ద‌క్కుతుంద‌నే భావ‌న‌తో ప‌వ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఏపీ జ‌నాభాలో నూటికి 50శాతం జ‌నాభా బీసీలే ఉండ‌టంతో వారిని ఇప్పుడు ప‌వ‌న్ టార్గెట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు