రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్న బొప్పాయి పాలు..!

బొప్పాయి పంటను( Papaya crop ) సాగు చేసే రైతులు కేవలం బొప్పాయి పండ్లను అమ్మడమే కాకుండా బొప్పాయి పాలను అమ్మి కూడా మంచి ఆదాయం పొందవచ్చు.

రైతులకు బొప్పాయి కాయలకి పాలు కారతాయని తెలుసు కానీ ఆ పాలను వివిధ రకాల మందులలో, సౌందర్య క్రీములలో ఉపయోగిస్తారని బహుశా తెలియకపోయి ఉండవచ్చు.

మార్కెట్లో బొప్పాయి పాలకు చాలా మంచి డిమాండ్ ఉంది.దీంతో రైతులు బొప్పాయి పంట సాగుతో అధిక ఆదాయం అర్జించవచ్చు.

సాధారంగా బొప్పాయి పంట సాగు అంటే బొప్పాయి కాయలు( Papaya fruits ) మాత్రమే గుర్తుకొస్తాయి.అయితే బొప్పాయి పాల డిమాండ్ గురించి అవగాహన ఉన్న రైతులు బొప్పాయి పంట చివరి దశలో ఉన్నప్పుడు.అంటే బొప్పాయి కాయలు 500 గ్రాముల బరువు కంటే తక్కువ సైజులో ఉన్న సమయంలో తోటలను తీసివేస్తుంటారు.

తర్వాత బొప్పాయి పాలు( Papaya milk ) సేకరించే కాంట్రాక్టర్లకు మొక్కలను అమ్మి అదనపు ఆదాయం పొందుతుంటారు.

Advertisement

బొప్పాయి కాయల నుండి పాల సేకరణ తెల్లవారుజాము నుండి 10:00 గంటల వరకు మాత్రమే చేస్తారు.ఈ పాల సేకరణ ప్రత్యేక పద్ధతుల్లో చేయాల్సి ఉంటుంది.ఏ చెట్టు నుండి పాలు తీయాలో ముందుగా ఆ చెట్టు కింద చుట్టూ ప్లాస్టిక్ కవర్ తో తయారు చేసిన ఓ జల్లెడ లాంటి అట్టను కింద ఉంచుతారు.

ఆ తరువాత బొప్పాయి కాయలపై గాట్లు వేస్తారు.కాయల నుండి కారే పాలన్ని కింద ఉన్న ప్లాస్టిక్ సంచులలో పడతాయి.కొద్దిసేపటికే ఆ పాలన్నీ గడ్డగా మారిపోతాయి.

పాలు కారడం నిలిచిపోయిన తర్వాత ఆ గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్ క్యాన్లలో నింపుతారు.ఒక ఎకరం లో ఉండే బొప్పాయి తోటకు రూ.20 వేల వరకు చెల్లించి కాంట్రాక్టర్లు బొప్పాయి పాలు సేకరిస్తుంటారు.

తాజా వార్తలు