పంచాంగ శ్రవణాలు రాను రాను భజన కీర్తనల లాగా మారిపోతున్నాయి

పంచాంగ శ్రవణం( Panchanga Sravanam ) అన్నది సైన్స్ కాకపోయినా దీన్ని నమ్మే వారి సంఖ్య తక్కువేమీ కాదు .

గ్రహాల కదలికలు బట్టి వాతావరణంలోనూ, పరిస్థితుల్లోనూ వచ్చే మార్పులను ఆ సంవత్సరంలో జరగబోయే శుభ అశుభ విశేషాలను క్రోడీకరించి చెప్పేదే ఈ పంచాంగ శ్రవణం.

పుట్టిన రాశి బట్టి ఆ రాశి కి అదిపతి అయిన గ్రహం సంచారం బట్టి ఆ రాశి వారికి జరిగే మంచి చెడులు ఆదారపడి ఉంటాయి అని చెప్తారు .ఉగాది ( Ugadi ) ఒక పర్వదినాన్ని పురస్కరించుకొని రాజకీయ పార్టీలు తమ పార్టీ ఆఫీసులలో ఈ పంచాంగ శ్రవణాన్ని వినిపించుకోవడం ఒక ఆచారంగా వస్తుంది.గత ముప్పై నలబై సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి వస్తున్న మార్పులు గమనిస్తే ఒకప్పుడు పంచాంగ కర్తలు అధినేతకు కలిగే మంచి చెడులు చెబుతూ,

Panchanga Sravanam Turning Into A Routine Farse Daybyday Details, Panchanga Srav

తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించేవారు.పరిస్థితులు అనుకూలంగా లేవంటే అందుకు చేయించాల్సిన పూజలు కూడా చెప్పేవారు.వ్యక్తి పూజ, స్వామి భక్తి ఆ రోజుల్లో కూడా ఉన్నప్పటికీ ఆ పండితులు చెప్పాల్సిన విషయాన్ని సూటిగానే చెప్పేవారు ఏదైనా కష్టం గాని నష్టం కానీ ఎదురయ్యే పరిస్థితి ఉన్నా కూడా ఓపెన్ గానే చెప్పేవారు.

ఇప్పుడు యధా రాజా తథా ప్రజా అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి .ఇప్పుడు పంచాంగ శ్రవణాలంటే ఆయా పార్టీ అధినేతల ముఖస్తుతి కోసం జరుగుతున్నట్లుగా పరిస్థితి మారిపోయింది.టిఆర్ఎస్ ఆఫీసులో కేసీఆర్ కి( KCR ) తిరుగు లేదని చెప్పే పండితులు గాంధీభవన్లో జరిగే పంచాంగ శ్రవణంలో రానున్నది కాంగ్రెస్ కాలమని చెప్తున్నారు.

Panchanga Sravanam Turning Into A Routine Farse Daybyday Details, Panchanga Srav
Advertisement
Panchanga Sravanam Turning Into A Routine Farse Daybyday Details, Panchanga Srav

అమరావతిలో జగన్ ( Jagan ) రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తుంటే టిడిపి ఆఫీస్ లో చంద్రబాబు ( Chandrababu Naidu ) అనుభవానికే ఈసారి అధికారం అంటున్నారు.అయినా వాళ్లు మాత్రం ఏం చేస్తారు విమర్శలని తట్టుకోలేనంత విపరీత మనస్తత్వాలు నాయకులలో పేరుగుతుంటే వారిని ప్రసన్నం చేసుకోవడానికి జరిగే మంచిని మాత్రమే చెప్పి ఊరుకుంటున్నారు.ఏది ఏమైనా రెండు ఛానల్ లో రెండు రకాల పంచాంగ శ్రావణాలను విన్న జనాలకి అసలు దేనిని నమ్మాలి ఎవరిది సరైన జ్ఞానం అన్న అయోమయం కలుగుతుంది.

గ్రహాలు వాటి ఫలితాలు అందరికీ ఒకే విధంగా ఉండాలి కానీ పార్టీకి అనుగుణం గా గ్రహాలు కూడా పార్టీ లు మార్చేస్తున్నాయా అన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి .రాను రాను ఇదంతా ఒక మొక్కుబడి వ్యవహారం లాగా మారిపోతుం.

Advertisement

తాజా వార్తలు