Prabhas : లండన్ లో ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రభాస్.. నెల రెంట్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రభాస్ ( Prabhas ) ఒకరు.

ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇకపోతే తాజాగా ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

ప్రభాస్ లండన్ ( London ) లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది.ఇటీవల కాలంలో సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున వివిధ దేశాలలో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు.

ఇక్కడ స్టార్ సెలబ్రిటీలకు గుర్తింపు పొందిన వారు బయట తిరగాలి అంటే వారికంటూ స్వేచ్ఛ ఉండదు అందుకే ఇతర దేశాలలో ఆస్తులను కొనుగోలు చేసి అక్కడికి వెకేషన్ లోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Advertisement

ఇలా వెకేషన్ వెళ్ళిన ప్రతిసారి హోటల్స్ బుక్ చేసుకోవడం కంటే తమకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చాలామంది భావించి వివిధ దేశాలలో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు లేదా ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా లండన్ లో ఒక ఇంటిని అద్దెకు( Rent )తీసుకున్నారట.ఇటీవల కాలంలో ప్రభాస్ తరచూ లండన్ వెళ్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం ఆయనకు మోకాలి ఆపరేషన్( Knee Surgery ) జరగడంతో నెలల పాటు లండన్ లోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలా ఎక్కువ కాలం పాటు లండన్ లో ప్రభాస్ ఉంటున్నటువంటి తరుణంలో ఈయన ఏకంగా అక్కడ ఒక ఇంటిని రెంట్ కు తీసుకున్నారని ఈ ఇంటి రెంట్ నెలకు 20 లక్షల రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు అంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి ప్రభాస్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు