అవినీతి కోసమే పాదయాత్రలు.. సోమువీర్రాజు కామెంట్స్

ఏపీలో కుటుంబ రాజకీయాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.వైసీపీకి అధికారం కావాలి.

అధికారం ఉంటే అవినీతి చేస్తారని విమర్శించారు.రాష్ట్రంలో నిర్వహిస్తున్న పాదయాత్రలు ప్రజల కోసం కాదన్న సోము వీర్రాజు అవినీతి కోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అనంతరం జనసేనతో బీజేపీ పొత్తుపై ఎందుకు అనుమానాలు అని ప్రశ్నించారు.టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలన్న ఆయన జనసేన కాదని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని వెల్లడించారు.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు