రెంట్‌ కు మూవీ వస్తే థియేటర్‌ కు ఎవరు వస్తారు భయ్యా?

ఇండియన్ మార్కెట్‌ లో కరోనా కారణంగా ఓటీటీ లు అనూహ్యంగా పుంజుకున్నాయి.2020 ముందు వరకు ఉన్న ఓటీటీ బిజినెస్ తో పోల్చితే ఈ రెండున్నర సంవత్సరాల్లో భారీ ఎత్తున ఓటీటీ బిజినెస్ పెరిగింది.

వంద రెట్ల ఖాతాదారులను కొన్ని ఓటీటీ లు దక్కించుకున్నాయి.

ఓటీటీ లో సినిమా లు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్ లు కూడా వస్తున్న నేపథ్యంలో ఏడాది పాటు సబ్‌ స్క్రిప్షన్ ను తీసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.ఎంతో మంది ఓటీటీ లో సినిమా లను చూస్తూ థియేటర్ కు వెళ్లడం లేదు.

పెద్ద హీరో సినిమా విడుదల అయినప్పుడు చాలా మంది నాలుగు వారాలు ఆగితే ఓటీటీ లో వచ్చేస్తుంది కదా అంటూ ఆగుతున్నారు.ఓటీటీ లో వచ్చాక చూసే స్తున్నారు.

ఇప్పుడు ఓటీటీ లు కొత్త పద్దతిని తీసుకు వచ్చారు.ఓటీటీ లో సినిమా ను చూడ్డానికి నాలుగు వారాలు కూడా ఆగనక్కర్లేదు.

Advertisement

రెండు మూడు వారాల్లోనే సినిమా ను ఓటీటీ ద్వారా తీసుకు వస్తున్నారు.అయితే ఓటీటీ లో ముందుగానే చూడాలంటే మాత్రం రెంట్‌ ఏ మూవీ పద్దతిని అనుసరించాల్సిందే.

అంటే సినిమాను రెంట్‌ పద్దతిన ఓటీటీ లు ఆఫర్ చేస్తున్నారు.కొంత మొత్తం ను సినిమా కు రెంట్‌ కు పెట్టి ఇంట్లో అందరు బయటి వారు కూడా చూసే వీలు ఉంటుంది.

కనుక థియేటర్‌ కు వెళ్లాల్సిన అవసరం లేదు.రెండు మూడు వారాలకు సినిమా లను రెంట్‌ కు ఇచ్చే పద్దతి హాలీవుడ్‌ లో ఉంది.ఇప్పుడు సౌత్‌ సినిమా లకు కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నారు.

మొన్న విడుదల అయిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆ తర్వాత విడుదల అయిన కేజీఎఫ్ 2 మరియు సర్కారు వారి పాట కూడా ఓటీటీ లో రెంటు పద్దతిలో ఉన్నాయి.కొన్ని రోజుల పాటు రెంటు పద్దతిన చూపించి ఆ తర్వాత సాదారణ సబ్‌ స్క్రిప్షన్ కు ఇస్తున్నారు.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?

ఈ పద్దతి వల్ల ముందు ముందు థియేటర్ల మనుగడ కష్టం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

Advertisement