Alia Bhatt : ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని నార్త్ వాళ్లు కావాలి అనుకోవడం లేదా ? 

మొత్తానికి తెలుగు వారి సత్తా ఏంటో చూపించి జాతీయ స్థాయి దాటి, ప్రపంచ స్థాయికి చేరుకొని ఆస్కార్ అవార్డు( Oscar award ) అందుకోవడంతో ఖండతరాలు దాటి ఇప్పుడు మన సినిమా పేరు, మన భాష పేరు వినిపిస్తోంది.

ఇక ఆస్కార్ అవార్డు గెలవడానికి కారకులు ఎవరు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇది జాతియ విజయంగా ఒప్పుకోవడంలో నార్త్ వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేక మన రాజమౌళి టీం ఆ విజయాన్ని తామే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.దాన్ని అన్ని భాషల వారికి చేర వేయడం కోసం ఆయా భాషల ఆర్టిస్ట్ లను సినిమా కోసం తీసుకున్నారు.

ఇక ఈ సినిమాలో తెలుగులో ఎలాగు మనవాళ్లంతా ఉండనే ఉన్నారు హిందీలో నుంచి ఆలియా భట్ ను(Alia Bhatt ) హీరోయిన్ గా తీసుకున్నారు.అలాగే అజయ్ దేవగన్(Ajay Devgn ) ని కూడా ఒక మంచి పాత్ర కోసం తీసుకున్నారు.ఇక కాస్త కూస్తో శ్రీయ కూడా నార్త్ అమ్మాయే కాబట్టి ఆమెను కూడా ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం తీసుకున్నారు.

ఇక తమిళ్ విషయానికి వస్తే సముద్రఖని ని కూడా తీసుకున్నారు దానివల్ల ఆ భాష లో కూడా కాస్త రీచ్ ఉంటుంది.తెలుగు తర్వాత హిందీ వారి మెజారిటీ ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తుంది.

Advertisement

అయితే ఇది హిందీ సినిమాగా నార్త్ వారు అనుకోక పోవడంతో వారికి ఈ సినిమా పరంగా అంత పేరు కూడా రాలేదు.కేవలం తెలుగు హీరోలకి దర్శకుడికి మాత్రమే ఆ గౌరవం దక్కింది.

ఇప్పటివరకు ఏం జరిగినా ఇప్పుడు మన సినిమా ఒక అతి ముఖ్యమైన ఆస్కార్ అవార్డు అందుకుంది.కాబట్టి ఈ విజయాన్ని జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అలాగే ఆలియా భట్ అజయ్ ల పేర్లు కూడా ప్రస్తావించి ఉంటే నార్త్ వారు కూడా ఈ సినిమాను ఎంతో కొంత ఓన్ చేసుకునేవారు.

అందరూ ఈ విషయంలో మౌనంగా ఉండటమే కొంతమేర అనుమానాలకు తావిస్తోంది.హిందీ నటులను తీసుకుంటే మాత్రమే సరిపోదు కదా వారిని అవసరమైన సందర్భంలో గుర్తించడం కూడా కావాలి.

అందుకే ఆస్కార్ కేవలం ఒక తెలుగు సినిమాకు వచ్చింది అన్న భావనలోనే దేశం మొత్తం మాట్లాడుతుంది.ఇది అందరి కష్టం వల్లనే సాధ్యం అయ్యింది.సమిష్టి విజయం గా రాజమౌళి మాట్లాడితే బాగుంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు