ఆపరేషన్ 'గరుడ'... ఇప్పుడు బుక్కయ్యేది శివాజీయేనా ...?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశం ఏదైనా ఉందా అంటే.అది జగన్ పై హత్యాయత్నం ఒకటి.

ఇక రెండవది ఆపరేషన్ గరుడ .‘ఆపరేషన్ గరుడ’.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తోన్న పదం.ఏడు నెలల క్రితం నటుడు శివాజీ పరిచయం చేసిన ఈ పదం మళ్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై దాడి జరగడమే.

నటుడు శివాజీ గతంలో చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ స్క్రిప్ట్ ప్రకారమే ఇప్పుడు జగన్‌పై దాడి జరిగిందని, ఇది బీజేపీ పనేనని టీడీపీ ఆరోపిస్తోంది.అసలు ‘ఆపరేషన్ గరుడ’ స్క్రిప్ట్ టీడీపీదేనని, శివాజీని బయటికి తీసుకొచ్చి విచారిస్తే అసలు విజయం తెలుస్తుందని వైసీపీ వాదిస్తోంది.

ఇంతకీ ఈ వాదనలు అన్నిటికీ మూల కారణం అయిన నటుడు శివాజీ మీద ఇప్పుడు అందరి ద్రుష్టి పడింది.శివాజీ చెప్పిన ఈ ఆపరేషన్‌ అనుకున్నట్టుగానే జరుగుతుండడంతో తెలంగాణ పోలీసులు.అటు కేంద్ర నిఘావర్గాలు ఆయన మీద దృష్టిపెట్టాయి.

Advertisement

శివాజీకి ఈ ఆపరేషన్ గురించి ఎవరు చెప్పారు? ఈ ఆపరేషన్ వెనుక ఎవరు ఉన్నారు? ఆయనకు ఎక్కడి నుంచి ఈ సమాచారం వచ్చింది అనే సంగతులు నిగ్గు తేల్చేందుకు వీరు సిద్ధం అవుతున్నారు.అయితే శివాజీ ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో.

ఇక్కడికి రాగానే ప్రశ్నించేందుకు ఎదురుచూస్తున్నారు.

ఈవిషయాలను పసిగట్టిన శివాజీ ఇప్పట్లో అమెరికా నుంచి వచ్చే అవకాశం కనిపించడంలేదు.ఆయన వస్తే.ఈ ఆపరేషన్ ద్వారా తెలంగాణలో కూడా ఏమైనా కుట్రలు చేయబోతున్నారా? ఎన్నికల వేళ ఎమైనా అలజడులు సృష్టించబోతున్నారా? అనే విషయాలపై శివాజీని ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.ఏపీలో అలజడి సృష్టించేందుకు బీజేపీ నేతలు ఆపరేషన్ గరుడ చేపట్టారని శివాజీ ఇంతకు ముందు ఆరోపించారు.

ఈ చిక్కుముడి వీడాలంటే శివాజీ నోరు మెడపాల్సిందే.అందుకే ఆయన చుట్టూ ఇప్పుడు పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు