కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

ఢిల్లీ వార్ రూమ్ లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది.

ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై చర్చిస్తున్నారు.

ఈ క్రమంలో ఇవాళ జాబితా ఖరారు చేసి ఏఐసీసీకి, ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది.కాగా మంగళ వారం లేదా బుధవారం ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే 14వ తేదీ లోపు అన్ని జాబితాలు సిద్ధం చేయాలని కాంగ్రెస్ యోచనలో ఉందని సమాచారం.మరోవైపు సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ, కమ్మ నేతలు కోరుతున్నారు.

కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్టానానికి ఓబీసీ నేతలు ఇప్పటికే విన్నవించారని తెలుస్తోంది.దీనిపై బీఆర్ఎస్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువే ఇస్తామని బీసీ, కమ్మ నేతలకు కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఇప్పటికే యాభై శాతానికి పైగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి అయిందని సమాచారం.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు