500 రూపాయలు ఎంటర్ చేస్తే ఐదు రెట్లు ఎక్కువిచ్చే ఏటీఎమ్.. ఎక్కడో తెలుసా?

మనం ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసేటప్పుడు తక్కువ రావడం చూసుంటాం.ఆ నోట్లు అందుబాటులో లేక డబ్బులే రాకుండా ఉండడం కూడా చూసి ఉంటాం.

కానీ ఓ చోట మాత్రం మనం 500 కావాలని ఎంటర్ చేస్తే.అదుకు ఐదు రెట్లు ఎక్కువగా వచ్చాయి.

అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో.వందలాది మంది ఆ ఏటీఎం మిషన్ ముందు క్యూ కట్టారు.

అయితే ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది.నాగ్ పూర్ పట్టణంలోని ఖాపర్ ఖేడా ప్రాంతంలోని ఓ ఏటీఎం కేంద్రానికి బుధవారం రోజు ఓ స్థానిక వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు.

Advertisement

తనకు 500 రూపాయలు కావాల్సి ఉండగా ఎంటర్ చేశాడు.కానీ అందులోంచి 2500 రూపాయలు చూసి షాకయ్యాడు.

ఆ విషయం నాగ్ పూర్ అంతా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఈ కేంద్రానికి తరలి వచ్చారు.కానీ బాధ్యత గల ఓ ఖాతాదారుడు విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.

వారు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేశారు.రంగంలోకి దిగిన బ్యాంకు సిబ్బంది ఏటీఎం ను మూసివేశారు.

అయితే సాంకేతిక లోపం వల్లే ఈ తప్పు జరిగిందని వారు వివరణ ఇచ్చారు.రూ.100 నోట్లు ఉంచాల్సిన ఏటీఎం ట్రేలో రూ.500 నోట్లు ఉంచడం వల్లే ఈ పొరపాటు జరిగిందని ఓ అధికారి తెలిపారు.అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement