చూసే కళ్ళు మంచివైతే చాలు.. బాలయ్య అంజలి వివాదంపై విశ్వక్ షాకింగ్ కామెంట్స్?

గత రెండు రోజులుగా బాలకృష్ణ(Balakrishna ) పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు.

ఈయన నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మందు బాటిల్ తో అక్కడికి వచ్చారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.అలాగే అంజలి(Anjali) ని బ్యాడ్ టచ్ చేశారని ఇక స్టేజ్ పై అందరి ముందు తనని వెనక్కి తోయడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Once Again Vishwak Sen Comments About Balakrishna And Anjali Contravorsy ,vishwa

ఇలా ఈ వీడియోలు వైరల్ కావడంతో ఏకంగా బాలయ్య (balakrishna) వ్యవహారంపై నేషనల్ మీడియాలు కూడా స్పందించి వార్తలు రాసేశారు.ఇక ఈ వ్యవహారంతో బాలయ్య పట్ల ఎంతోమంది నెగిటివ్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.ఇలా బాలయ్య గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో అంజలి స్పందించి ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు.

అయితే తాజాగా మరోసారి విశ్వక్ ఈ వివాదం పై స్పందించారు.

Once Again Vishwak Sen Comments About Balakrishna And Anjali Contravorsy ,vishwa
Advertisement
Once Again Vishwak Sen Comments About Balakrishna And Anjali Contravorsy ,Vishwa

అంజలి ఈ ఘటనపై స్పందిస్తూ బాలయ్యకే తన మద్దతు అనేలా పోస్ట్ చేశారు.ఇక ఈ విషయం గురించి విశ్వక్ మాట్లాడుతూ అమ్మాయికే లేని ఫీలింగ్స్ మీరు తెప్పించారుగా ఇప్పటికైనా ఈ ద్వేషం ఆపండి.నెగిటివిటీ కాకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.

మా టీమ్ గోల్డ్.చూసే కళ్ళు మంచివైతే చాలు మా బాలయ్య బంగారం.

ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టికెట్లు బుక్ చేసుకోండి అంటూ ఈ సందర్భంగా విశ్వక్ మరోసారి ఈ ఘటన పట్ల స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు