తాజ్‌మహల్ ముందు ఒంటరిగా కూర్చున్న ప్రిన్సెస్ డయానా.. ఆ ఓల్డ్ స్టోరీ తెలిస్తే!

ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్‌ను( Taj Mahal ) చూసేందుకు దేశ విదేశాల నుంచి సామాన్యులతో పాటు ప్రముఖులెందరో వస్తుంటారు.

ప్రిన్సెస్ డయానా( Princess Diana ) కూడా ఈ అద్భుతమైన కట్టడాన్ని చూసేందుకు 1992లో వచ్చారు.

దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ (గతంలో ట్విట్టర్) యూజర్ మీమాంస శేఖర్ తాజాగా షేర్ చేశారు.అవి కాస్త వైరల్ గా మారాయి.

ప్రిన్సెస్ డయానా తన భర్త ప్రిన్స్ చార్లెస్‌తో( Prince Charles ) కలిసి 1992లో భారతదేశాన్ని సందర్శించారు.అయితే, వారి వైవాహిక జీవితంలో అప్పటికే కలతలు ఏర్పడ్డాయి.

దాంతో ఎక్కడికి వెళ్ళినా వారు తరచుగా విడివిడిగా కనిపించేవారు.

Advertisement

తాజ్ మహల్ సందర్శన సమయంలో కూడా చార్లెస్ సమావేశాలతో బిజీగా ఉంటే డయానా దానిని చూసేందుకు ఒంటరిగా వెళ్లారు.డయానా తాజ్ మహల్ వద్ద ఒంటరిగా కూర్చుని ఫొటోలకు పోజులు ఇచ్చారు.అందులో ఒకటి వైరల్ అయింది.

అప్పట్లో వారి విడాకుల గురించి( Divorce ) ఊహాగానాలకు అది దారి తీసింది.తాజ్ మహల్ ముందు ఒంటరి పక్షిగా ఆమె కనిపించడం చూసి ఆమె హార్ట్ బ్రేక్ అయి ఉంటుందని చాలామంది కామెంట్లు చేశారు.

నిజానికి తాజ్ మహల్ సందర్శన తర్వాత కొన్ని నెలలకు ప్రిన్సెస్, చార్లెస్ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అయినా కలిసి 4 ఏళ్ల దాకా రాయల్ డూటీస్ నిర్వహించారు.క్వీన్ ఎలిజిబెత్ II( Queen Elizabeth II ) వారి విషయంలో కలగజేసుకొని కలిసి ఉండలేకపోతే డివోర్స్ తీసుకోవడం బెటర్ అన్నట్లు మాట్లాడారు.దాంతో చివరికి డయానా, చార్లెస్ 1996లో విడాకులు తీసుకున్నారు, డయానా 1997లో కారు ప్రమాదంలో మరణించారు.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్

ఆమె మరణం ఎంతో మందిని కలిచి వేసింది.గ్లామర్‌తో, మంచితనంతో ఇంటర్నేషనల్ ఐకాన్‌గా మారిన ప్రిన్సెస్ డయానా మరణం ఇప్పటికీ జీర్ణించుకోలేనిది.

Advertisement

తాజా వార్తలు