గుంటూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య..స్నేహితుల మధ్య కక్షలే కారణమా..!

గుంటూరు జిల్లాలోని( Guntur District ) రేపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

రేపల్లె పట్టణంలోని( Repalle ) 23వ వార్డులో మేక రాముడు, నాగమణి అనే దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి మేక సాయి కుమార్ సంతానం.

అయితే సాయి కుమార్ కు జగనన్న కాలనీలో అద్దెకు నివాసముండే హర్ష, రేపల్లె ఓల్డ్ టౌన్ కు చెందిన జయప్రకాష్ చిన్ననాటి స్నేహితులు.

Advertisement

మంగళవారం రాత్రి జయప్రకాష్, సాయికుమార్ ను తీసుకొని మద్యం సేవించేందుకు ఆరవపల్లి రోడ్డులోని స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లాడు.ఆ ప్రాంతానికి హర్ష కూడా వచ్చాడు.కాసేపటి తరువాత జయప్రకాష్( Jayaprakash ) ఫోన్లో చార్జింగ్ అయిపోవడంతో, ఇంటికి వెళ్లి చార్జింగ్ పెట్టి వస్తానని జయప్రకాష్ వెళ్లాడు.

జయప్రకాష్ ఇంటి నుండి తిరిగి వచ్చేసరికి సాయికుమార్( Saikumar ) శవమై కనిపించాడు.హర్ష అనిపించలేదు.సాయికుమార్ మృతదేహాన్ని పరిశీలిస్తే మెడపై కత్తితో పొడిచిన గాయాలు ఉండడంతో హత్య జరిగి ఉంటుందని భావించిన జయప్రకాష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

రేపల్లె పట్టణ సీఐ నజీర్ బేగ్ ఘటన స్థలాన్ని పరిశీలించి, హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.అయితే మృతుడు సాయికుమార్ కు, హర్ష కు మధ్య మూడు నెలల క్రితం గొడవ జరిగింది.అప్పటినుండి వీరి మధ్య మనస్పర్ధలు పెరిగి కక్షతోనే హర్ష, సాయి కుమార్ ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హత్యకు గల కారణాలు ఏమిటో.హత్య ఎవరు చేశారో త్వరలోనే వెలుగులోకి వస్తాయని సీఐ నజీర్ బేగ్ తెలిపారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Advertisement

తాజా వార్తలు