స్కూటర్లు మాత్రమే కాదు మోటర్ బైక్స్ కూడా తీసుకొస్తున్న ఓలా..

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యింది.

అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్‌1 ఎయిర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.

బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2023 చివరి నాటికి ఇ-మోటార్‌సైకిల్స్ వ్యాపారంలోకి, డిసెంబర్ 2024 నాటికి కార్ల వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తామని తెలిపింది.కాగా ఇటీవలే ఓలా తన చీప్ స్కూటర్ ఓలా ఎస్1 ఎయిర్‌ను రూ.79,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది.ఓలా ఎలక్ట్రిక్ మాస్, మిడ్-సెగ్మెంట్, ప్రీమియం సూపర్‌బైక్‌ల మూడు విభాగాల్లో తన ఉనికిని చాటుకునేలా ప్లాన్ చేస్తోందని వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఇటీవలే తెలిపారు.రూ.80,000 నుంచి రూ.10 లక్షల మోటార్‌సైకిల్ మార్కెట్‌ను తాను స్టడీ చేసినట్లు తెలిపారు.అయితే ఈవీలలో హైపర్ సెగ్మెంటేషన్ అవసరం లేదని తాను అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం దేశంలో రిలీజ్ అవుతున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు తనని అంతగా ఆకట్టుకోవడం లేదని అన్నారు.

ఓలా మోటర్‌బైక్ గురించి ఏ వివరాలు తెలియలేదు.అయితే కంపెనీ మంచి ఈ-బైక్‌ని రూపొందించడంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించాలని యోచిస్తోంది.అలానే ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని కూడా ప్రణాళికలు రచిస్తోంది.

Advertisement

కాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేయడం కంటే ఎలక్ట్రిక్ బైక్స్, కార్లు అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం కొద్దిగా కష్టమైన పని అని చెప్పచ్చు.మోటార్ బైక్స్ ఓలా బ్రాండ్ నుంచి విడుదల అయితే వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు.

స్కూటర్లు లాంగ్ రైడ్స్‌కి అంత కంఫర్టబుల్ గా ఉండవు.ఇక స్టైలిష్ గా కూడా లేని వీటిని యువత కొనుగోలు చేయడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నారనే చెప్పాలి.

Advertisement