చర్మంపై జిడ్డును తొలగించే అద్భుతమైన నిమ్మ ప్యాక్స్

నిమ్మరసం అనేక చర్మ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు.నిమ్మరసంను పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

చర్మంలో ఉన్న అధికంగా ఉన్న నూనెను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంపై జిడ్డును తొలగించటంలో సహాయపడుతుంది.

నిమ్మతో పేస్ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జిడ్డు సమస్య తొలగిపోతుంది.రెండు స్పూన్ల టమోటా గుజ్జులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Advertisement

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జిడ్డు తొలగిపోతుంది.ఒక స్పూన్ అలోవెరా జెల్ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 10నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

రెండు స్పూన్ల గ్రీన్ టీలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే జిడ్డు సమస్య తొలగిపోతుంది.ఒక బౌల్ లో ఒక స్పూన్ పాలపొడి, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి.

పేస్ట్ అయ్యేవరకు బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ఫిషియల్ స్కిన్ పై సున్నితంగా అప్లై చేయండి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
కళ్ళజోడు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా ట్రై చేయండి...!

అయిదు నుంచి పది నిమిషాల తరువాత, గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.ఈ పేస్ట్ ని వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా గుర్తించదగ్గ ఫలితాలను పొందవచ్చు.

Advertisement