ఆఫ్ఘన్ చేతిలో ఓడిన పాక్ సెమీస్ చేరాలంటే.. ఏం జరగాలంటే..!

వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) టోర్నీలో పసికూన జట్లు విజయాలు సాధిస్తుంటే.

గతంలో టైటిల్ గెలిచి ఛాంపియన్ గా నిలిచిన జట్లు ఓటములను చవిచూస్తున్నాయి.

ఈ టోర్నీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు పసికూన జట్ల చేతుల్లో ఘోరంగా ఓటమిని చవిచూస్తున్నాయి.ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు( Pakistan ) పరిస్థితి చాలా దారుణంగా మారింది.

ఒక మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం.మరో మ్యాచ్లో బౌలింగ్ వైఫల్యం.

ఈ రెండు బాగుంటే ఫీల్డింగ్ లో క్యాచ్లు జారవించడం.ఇలా ఏదో ఒక వైఫల్యం పాకిస్తాన్ జట్టును వెంటాడి గెలుపును దూరం చేస్తోంది.

Advertisement

మరి పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ ( Semifinal ) చేరే అవకాశాలు సజీవంగానే ఉన్నాయా.జట్టు సెమీఫైనల్ చేరాలంటే ఏం జరగాలో చూద్దాం.పాకిస్తాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం రెండు మ్యాచ్లలోనే విజయం సాధించింది.

ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.ఈ నాలుగు మ్యాచ్లలో పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తే.మొత్తం ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఉంటుంది.

అయినా కూడా ఈ జట్టు సెమిస్ చేరుతుందా లేదా అనేది మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.

ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను పరిశీలిస్తే.భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరే అవకాశం ఉంది.కాబట్టి సెమీస్ రేసులో ఉన్న సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో ఏదో ఒక జట్టు ఫలితాలు తారుమారు అవడం.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

పాకిస్తాన్ తదుపరి మ్యాచ్లలో అధిక రన్ రేట్ తో( Run Rate ) గెలవడం జరిగితే.పాకిస్తాన్ సెమిస్ చేరుతుంది.అయితే ఇలా జరగడం ఒకరకంగా చాలా కష్టమే.

Advertisement

ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ సెమీస్ చేరేది లేనిది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు