'ట్రంప్' ప్రమాదకారి..ఒబామా సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న పనులు విదేశీయులకి మాత్రమే కాదు ఆదేశ పౌరులకి , మాజీ అధ్యక్షులకి కూడా రుచించడం లేదు.

ఒక నియంతలా ట్రంప్ పాలన సాగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అభివృద్దికి ఆటంకం తెస్తూ ప్రజా స్వామ్య విలువలని కాలరాస్తున్నాడు అంటూ ట్రంప్ పై ఫైర్ అవుతున్నారు.ఈ లిస్టు లోకి తాజాగా మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా చేరిపోయారు.

ట్రంప్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ కనీస ప్రజాస్వామ్య విలువల్ని పాటించటం లేదని, చట్టాన్ని, పత్రికా స్వేచ్ఛకు ప్రమాదకరంగా మారారని ఒబామా విమర్శించారు.ప్రతినిధుల సభకి జరుగుతున్నా ఎన్నికల నేపధ్యంలో ఆయన ఒక విడియో ని విడుదల చేశారు.క్రిమినల్‌ నేర విచారణ వ్యవస్థను చూపుతూ.

Advertisement

తన రాజకీయ ప్రత్యర్థుల్ని (హిల్లరీ క్లింటన్‌) ట్రంప్‌ బెదిరిస్తున్నారని ఒబామా తీవ్ర ఆరోపణలు చేశారు.పారదర్శకమైన పాలన అందించటంలో ట్రంప్‌ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు పట్టును కలిగివున్నారు.మళ్ళీ డెమొక్రాట్లకు పట్టు సంపాదించాలి అంటే నవంబరు ఎన్నికలే నిర్ణయాత్మకం.ఈ నేపధ్యంలోనే ఒబామా ఇల్లినాయిస్‌ వర్సిటీ నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఒబామా విడుదల చేస్తున్న ప్రసంగ వీడియో లకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఒబామా ఆదిసగానే దూకుడుగా వ్యవహరిస్తున్నారు.అప్పట్లో తానూ తీసుకున్న నిర్ణయాల కారణంగానే నేడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పుకొస్తున్నారు.

అయితే ఒబామా చేస్తున్న విమర్శల్ని డొనాల్డ్‌ ట్రంప్‌ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?
Advertisement

తాజా వార్తలు