Singapore : నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా ఇద్దరు భారత సంతతి ప్రముఖులు

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) ట్రస్టీల బోర్డు( National University of Singapore board of trustees )లో నియమించబడిన ముగ్గురు కొత్త సభ్యులలో ఇద్దరు భారత సంతతి ప్రముఖులు జస్టిస్ జుడిత్ ప్రకాష్, రవి మీనన్‌లకు చోటు దక్కింది.

వీరితో పాటు టాన్ చోంగ్ మెంగ్‌ను ధర్మకర్తల బోర్డులో నియమించినట్లు ఎన్‌యూఎస్ పేర్కొంది.

బోర్డులోని ముగ్గురు కొత్త సభ్యులు.ఎన్‌యూఎస్ పూర్వ విద్యార్ధులు కావడం విశేషం.

వీరి పదవీకాలం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందని యూనివర్సిటీ పేర్కొంది.మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన మీనన్.2011 నుంచి ఈ ఏడాది జనవరి 1న పదవీ విరమణ చేసే వరకు ఆ హోదాలో కొనసాగారు.ఆయన సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ బోర్డ్ డిప్యూటీ చైర్మన్ ( Central Provident Fund Board Deputy Chairman ), హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు , డీబీఎస్ బోర్డులలోనూ పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.

మీనన్ ప్రస్తుతం గ్లాస్గో ఫైనాన్షియల్ అలయన్స్ ఫర్ నెట్ జీరో (జీఎఫ్ఏఎన్‌జెడ్), ఆసియా పసిఫిక్ నెట్‌వర్క్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ , జీఎఫ్ఏఎన్‌జెడ్ ప్రిన్సిపల్స్ గ్రూప్ సభ్యుడు.అలాగే సింగపూర్ ఇండియన్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (సిండా)కి ట్రస్టీ కూడా.

Advertisement

ఇకపోతే. సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ప్రకాష్( Justice Judith Prakash ) 30 ఏళ్లకు పైగా సుప్రీంకోర్టు బెంచ్‌లో పనిచేశారు.అంతేకాదు అప్పీల్ కోర్ట్ శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ కూడా.

గతంలో మధ్యవర్తిత్వ వ్యవహారాలకు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు.ప్రస్తుతం ఎస్ఐఎన్‌డీఏ, యురేషియన్ అసోసియేషన్ ధర్మకర్తల బోర్డులలోనూ విధులు నిర్వర్తించారు.

టాన్ విషయానికి వస్తే.ఈ నెలలో పదవీ విరమణ చేసే వరకు పోర్ట్ ఆపరేటర్ పీఎస్ఏ ఇంటర్నేషనల్ గ్రూప్ సీఈవోగా వున్నారు.

ప్రస్తుతం జురాంగ్ టౌన్ కార్పోరేషన్ (జేటీసీ) ఛైర్మన్, నేషనల్ యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు.వరల్డ్ ఎకనమిక్ ఫోరం సప్లై చైన్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీ కమ్యూనిటికీ గవర్నర్ చైర్‌గా, కోవిడ్ నుంచి దేశం ఆర్ధికంగా పునరుద్ధరణకు మార్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగపూర్ ఎమర్జింగ్ స్ట్రాంగర్ టాస్క్‌ఫోర్స్‌కు కో చైర్మన్‌గానూ టాన్ పనిచేశారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

కొత్తగా ట్రస్టులో నియమితులైన జస్టిస్ ప్రకాష్, టాన్, మీనన్‌( Tan Chong Meng, Ravi Menon )లకు ఎన్‌యూఎస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఛైర్మన్ Hsieh Fu Hua స్వాగతం పలికారు.ప్రస్తుతం ఎన్‌యూఎస్ బోర్డు ఆఫ్ ట్రస్టీలలో 20 మంది సభ్యులున్నారు.ఛానెల్ న్యూస్ ఏషియా నివేదిక ప్రకారం ఎన్‌యూఎస్ సభ్యులను విద్యా శాఖ మంత్రి నియమిస్తారు.

Advertisement