Taraka Rama Rao : దటీజ్ సీనియర్ ఎన్టీఆర్.. ఆ పాట తరతరాలు నిలిచిపోవాలని ఎన్టీఆర్ అలా చేశారా?

తెలుగు ప్రేక్షకులకు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆ తరం ఈ తరం రెండు తరాల ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ సుపరిచితమే.

అయినా కొన్ని వందల సినిమాలలో సినిమాలలో నటించి హీరోగా రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.కాగా సీనియర్ ఎన్టీఆర్ ఏదైనా సినిమా తీస్తే దానిలో ప్రతి సన్నివేశాన్ని ఆయన ముందుగానే పరిశీలిస్తారు.

అంకిత భావం ఉండాలని చెబుతారు.తాను కూడా ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి ఫ్రేమ్ లో అన్నగారి ముద్ర కనిపించేలా చేసుకుంటారు.

సినిమా చేసేటప్పుడు అలాంటి టీమ్ ని ఆయన ఎంచుకుంటారు కూడా.ఒక్కరూపాయి కూడా వేస్ట్ కావడానికి వీల్లేదని చెబుతారు.

Advertisement
Ntr Wanted That Song To Last For Generations-Taraka Rama Rao : దటీజ్

అదేవిధంగా నిడివి కూడా అంతే ఉండాలని తీసిన ప్రతి ప్రేమ్ కూడా ఎడిట్ అవ్వకుండా ఉండాలని పదే పదే చెబుతుంటారు.నటీనటుల హావభావాలను చాలా దగ్గరగా పరిశీలిస్తారు.

అలా ఎన్టీఆర్ చేసిన స్వంత సినిమాలు ప్రతిదీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.బ్లాక్ అండ్ వైట్, కలర్ ( Black and white, color )ఏ సినిమాలు అయినా కూడా అన్నగారు మనసు పెట్టి చేసేవారు.

తొలిరోజుల్లో అన్నగారు చాలా సాహసోపేతమైన సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చారు.ముఖ్యంగా పౌరాణికా లకు ఆయన అగ్రతాంబూలం ఇచ్చారు.

Ntr Wanted That Song To Last For Generations

అయితే ఆయన సోదరుడు త్రివిక్రమ రావు ( Trivikrama Rao )మాత్రం అందరికీ తెలిసిన కథలే తీస్తే ఏం పోతాయ్? అని పెదవి విరి చేవారట.సీనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమాలలో సీతారామ కళ్యాణం సినిమా కూడా ఒకటి.ఇందులో ఎన్టీఆర్ రావణాసురుడి పాత్రలో నటించారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

చాలా వైవిద్యాన్ని ప్రదర్శించారు.దాదాపు రావణాసురుడి జీవితాన్ని చూపించే ప్రయత్నం చేశారు.

Advertisement

కాగా రామాయణంలోని కీలక ఘట్టాలను యథాతథంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఎక్కడా రాజీ పడలేదు.

వాహినీ స్టూడియోను( vahini studio ) ఏడాది కాలం పాటు అద్దెకు తీసుకున్నారు.అప్పట్లో ఇంత సుదీర్ఘంగా అద్దెకు తీసుకున్నవారు ఎవరూ లేరని అంటారు.

దీనిలోనే లంకా నగరం సెట్ సహా సీతారాముల కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారట.ఇందులో సీతారాముల కళ్యాణం పాటకు వచ్చేసరికి సినిమాలో చివరన చేర్చారు.

దీనిని సముద్రాల సీనియర్ రచించారు.ఇప్పటికీ ఎక్కడ పెళ్లి జరిగినా శ్రీరామ నవమి పందిళ్లలో సహా ఆలయాల్లో మార్మోగే.శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ పాట ఆబాల గోపాలన్నీ అలరిస్తుంది.

ఈ పాటను రాసింది సముద్రాల సీనియర్.దీనికి సంగీతం అందించింది ఘంటసాల.

అయితే ఈ పాట ఏమీ ఒక రాత్రిలో అయిపోలేదు.రాసేందుకు మూడు నెలలు పట్టింది.

ఏ పాట తీసుకువెళ్లినా అన్నగారికి నచ్చేదికాదట.అప్పుడు ఆయన ఒక్కటే చెప్పేవారట మీరు ఏం చేస్తారో తెలియదు.

తరతరాల పాటు ఈ పాట నిలిచిపోవాలి అని సముద్రాలకు సూచించారు.సముద్రాల ప్రాణం పెట్టి రాసిన పాట ఇది.ఇప్పటికీ ఈ పాట అజరామరంగా నిలిచిపోయింది.

తాజా వార్తలు