ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ సూపర్ హిట్ సినిమాలేంటో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటుడు ఎన్టీఆర్.ఆయన నటించిన ఎన్నో సినిమాలు రికార్డులను కొల్లగొట్టాయి.

పలు సినిమాలు ట్రెంట్ సెట్టర్ గా నిలిచాయి.అంతేకాదు.

తెలుగు సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చారు.బాలీవుడ్ మూవీలను తెలుగులోకి రీమేక్ చేశాడు.

తెలుగులో ఈ తరహా ప్రయోగం కొత్తది కావడం విశేషం.అవీ అమిత్ బచ్చన్ నటించి హిట్ కొట్టిన సినిమాలనే ఆయన తెరకెక్కించాడు.

Advertisement
Ntr Remakes From Amitab Bachchan , Na Dehsam-lavaris, Satyam Shivam-suhag, Rama

ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

నిప్పులాంటి మనిషి-జంజీర్‌

Ntr Remakes From Amitab Bachchan , Na Dehsam-lavaris, Satyam Shivam-suhag, Rama

52 ఏండ్ల వయసులో నిప్పులాంటి మనిషి రీమేక్‌ మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా హిందీలో అమితాబ్‌ బచ్చన్ నటించిన జంజీర్‌ చిత్రానికి రీమేక్.ఆ మూవీ పోలీస్‌ కేరెక్టర్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది.

మా వారి మంచితనం- దో అంజానే’

Ntr Remakes From Amitab Bachchan , Na Dehsam-lavaris, Satyam Shivam-suhag, Rama

అమితాబ్ బచ్చన్ మరో మూవీ దో అంజానే.ఈ సినిమాను ఎన్టీఆర్ మా వారి మంచితనం పేరుతో రీమేక్ చేసారు.విజయం సాధంచారు.

మగాడు- దీవార్

Ntr Remakes From Amitab Bachchan , Na Dehsam-lavaris, Satyam Shivam-suhag, Rama

బిగ్‌బీ దీవార్ సినిమాను ఎన్టీఆర్.మగాడు పేరుతో రీమేక్ చేసిన సక్సెస్ అందుకున్నారు.ఈ సినమా తమిళ రీమేక్‌లో రజినీకాంత్, సుమన్ హీరోలుగా థీ పేరుతో రీమేక్ చేసారు.

టైగర్- ఖూన్ పసీనా

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

ఎన్టీఆర్ రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ మరో సూపర్ హిట్ మూవీ ఖూన్ పసీనా.హిందీలో అమితాబ్, వినోద్ ఖన్నా నటించిన ఈ చిత్రం.తెలుగు రీమేక్‌ టైగర్ లో ఎన్టీఆర్, రజినీకాంత్ హీరోలుగా చేశారు.

యుగంధర్- డాన్

Advertisement

అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ మూవీ డాన్ ను.ఎన్టీఆర్ యుగంధర్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు.

రామకృష్ణులు- హేరాఫేరి

అమితాబ్ చేసిన ఎవర్ గ్రీన్ మల్టీ స్టారర్స్‌ లో హేరాఫేరి ఒకటి.ఈ అద్భుతమైన సినిమాలో బిగ్ బీతో కలిసి వినోద్ ఖన్నా కలిసి చేశారు.తెలుగులో నందమూరితో అక్కినేని కలిసి రామకృష్ణులు అనే పేరుతో రీమేక్ చేశారు.

సత్యం శివం- సుహాగ్

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా సత్యం శివం.ఇది కూడా అమితాబ్ బచ్చన్ శశి కపూర్‌తో చేసిన సుహాగ్ సినిమా రీమేక్.

నా దేశం- లావారిస్

అమితాబ్ సూపర్ హిట్ మూవీ లావారిస్ ను.ఎన్టీఆర్ తెలుగులో నా దేశం పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

తాజా వార్తలు