జపాన్ మీడియాతో ఎన్టీఆర్ మాటలు.. ఫోటో వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలె జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారు.

మరి ముఖ్యంగా జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానించే వారి సంఖ్య ఎక్కువ ఉంది అనడంలో ఎటువంటి అతియో శక్తి లేదు.జపాన్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ తరువాత అంత క్రేజ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అనే చెప్పవచ్చు.

Advertisement

ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన పని సినిమాలు జపాన్ లో విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి.ఇక ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించినఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

జపాన్ లో అక్టోబర్ 21వ తేదీన విడుదల కానుంది.అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇక జపాన్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్ మీడియాతో ఆన్లైన్ వేదికగా ముచ్చటించారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన విశేషాలను వారితో పంచుకున్నారు ఎన్టీఆర్.ఏ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జపనీస్ మీడియాతో ఆర్ఆర్ఆర్ అనుభవాన్ని తిరిగి పొందుతున్నాను.అందరి ప్రేమ ప్రశంసలకు ధన్యవాదాలు అని జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు