ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ హెల్ఫ్‌

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.ఏపీలో అధికార పార్టీ టీడీపీకి ఎన్టీఆర్‌కు ఎంతో లింక్ ఉంది.

ఎన్టీఆర్ లైఫ్ అంతా టీడీపీతో ముడిప‌డి ఉంది.2009 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేశారు.ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, బాల‌య్య‌తో ఎన్టీఆర్‌కు గ్యాప్ రావ‌డంతో ఎన్టీఆర్ రాజ‌కీయంగా బ్యాక్‌బెంచ్‌లో ఉన్నాడు.

మూడు వ‌రుస హిట్ల త‌ర్వాత బాబి డైరెక్ష‌న్‌లో జైల‌వ‌కుశ సినిమాలో న‌టిస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమా త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ఆ తర్వాత కొర‌టాల శివతో మ‌రో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.ఇక ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబోలో తెర‌కెక్కే సినిమా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఉంటుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ పొలిటిక్ కెరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా అంశాల నేప‌థ్యంలో చాలా సెన్షేష‌న‌ల్‌గా ఉంటుంద‌ట‌.2019 ఎన్నిక‌ల టైంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి.ఎన్నిక‌ల టైంలో ఎన్టీఆర్ పొలిటిక‌ల్ స‌బ్జెక్టుతో సినిమా చేయ‌డం అంటే అది ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందా ? అన్న ఆస‌క్తి ఇండ‌స్ట్రీలో నెల‌కొంది.

తాజా వార్తలు