భార్యకు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ఎన్టీఆర్ ఆ వంటకం వండుతారట.. ఏమైందంటే?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఆ సంగతి పక్కన పెడితే ఆయన హీరోగా వెండితెరపై నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఇంట్లో కూడా తన భార్య పిల్లలతో కలిసి సరదాగా ఉండడం అలాగే అప్పుడప్పుడు వంటలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారట.

Ntr Garlic Chili Powder For His Wife Details, Ntr, Garlic Chili Powder, Pranathi

ఆయన వంటల గురించి చాలా సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.కింద కళ్యాణ్ రామ్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.తనకు ఏం తోచకపోయినా కూడా టెన్షన్ లో ఉన్నా కూడా వెంటనే బిర్యానీ అలాగే నాన్ వెజ్ లో బాగా వండుతాడని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

Advertisement
NTR Garlic Chili Powder For His Wife Details, Ntr, Garlic Chili Powder, Pranathi

తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది అయినా హీరో నార్నే నితిన్( Narne Nithin ) మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా మాట్లాడుతూ.దమ్ బిర్యానీ బాగా చేస్తాడు.

హలీం అయితే ఇంకా సూపర్బ్ గా వండుతాడు.అక్క ప్రణతి( Pranathi ) కోసం బావ స్పెషల్ గా వండుతారు.

Ntr Garlic Chili Powder For His Wife Details, Ntr, Garlic Chili Powder, Pranathi

రీసెంట్ గా అక్కకు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే అక్క ఇన్స్టాలో చూసి ఏదో కారం గురించి చెబితే బావ వెంటనే ఆ వెల్లులి కారాన్ని అక్క కోసం రెడీ చేసాడు.అక్కని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు, ఇన్స్టా లో ఏది చూసినా బావ వండేస్తాడు అంటూ ఎన్టీఆర్ వంట పై నార్నె నితిన్ క్రేజీ కామెంట్స్ చేసాడు.ఈ సందర్భంగా నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ విషయం తెలిసి అభిమానులు నిజమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.మా హీరో ఎన్టీఆర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా వంటలు చేయడంలో కూడా దిట్ట అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

చరణ్ మూవీ ఆడియో రైట్స్ కు రికార్డ్ రేట్.. ఫ్లాపులొస్తున్నా చరణ్ క్రేజ్ తగ్గట్లేదుగా!
Advertisement

తాజా వార్తలు