ఒక్కసారైనా ఎన్టీఆర్ గురించి అడగొచ్చు కదా బాలయ్య.. మరి ఇంత దారుణమా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ( Nandamuri Family ) ఎంతో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి నందమూరి తారక రామారావు వారసుడిగా బాలకృష్ణ ( Balakrishna ) ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు.

ఇక బాలకృష్ణ తరువాత నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలను ఎన్టీఆర్ ఉన్నత శిఖరాలకు చేర్చిన సంగతి తెలిసిందే.

ఈయన నందమూరి వారసుడిగా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇకపోతే ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ( NTR ) బాలకృష్ణ మధ్య చాలా దూరం పెరిగిందనే విషయం మనకు తెలిసిందే.

నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు జరిగిన ఎన్టీఆర్ కు ఎలాంటి ఆహ్వానం అందడం లేదు.

ఇలా బాలకృష్ణ పలు సందర్భాలలో ఎన్టీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇకపోతే బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్టార్ హీరోలు యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ ను మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు అంతేకాకుండా ఈ టాక్ షోలో హీరోలు హాజరైనప్పుడు ఇతర హీరోలకు ఫోన్లు చేసి మాట్లాడటం లేదంటే బాలకృష్ణ ఇతర హీరోల గురించి అడగడం మనం చూస్తున్నాము.

Advertisement

ఇటీవల అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి రావడంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ రణబీర్ కపూర్ వంటి వారందరి ఫోటోలను చూయించి మరి వారి గురించి బాలయ్య ప్రశ్నించారు.కానీ నాలుగు సీజన్లు ప్రసారం కాగా ఇప్పటివరకు ఏ ఒక్క సీజన్లో కూడా ఎన్టీఆర్ గురించి ప్రశ్నించకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోయిన ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోల వద్ద ఎన్టీఆర్ గురించి ఒక్కసారైనా బాలయ్య ప్రశ్నించొచ్చు కదా.మరి ఇంతలా ద్వేషించాల అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

తమిళ్ ఇండస్ట్రీ ని పాన్ ఇండియాలో నిలిపే సత్తా ఆ స్టార్ హీరోకే ఉందా..?
Advertisement

తాజా వార్తలు