'ఎవరు మీలో కోటీశ్వరులు' కీలక అప్‌డేట్ ఇచ్చిన యాంకర్ రవి

ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభం కాబోతుంది.

సాదారణంగా షో వారంలో రెండు రోజుల పాటు షూటింగ్‌ చేసి వారం అంతా కూడా టెలికాస్ట్‌ చేస్తారు.

కాని ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా చేస్తున్న షో కు మాత్రం మొత్తం షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్లుగా ఉన్నారు.కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్‌ మొదలు అయ్యిందంటూ వార్తలు వచ్చాయి.

Ntr Evaru Meelo Koteeswarlu Show Shooting Start , Ntr , Evaru Meelo Koteeswarlu,

కాని జెమిని వారి నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అసలు ఈ షో ఉందా లేదా.షూటింగ్‌ ప్రారంభం అయ్యిందా లేదా అనే అనుమానాలు మొదలు అయ్యాయి.

కాని తాజాగా యాంకర్‌ రవి తన యూట్యూబ్‌ ఛానెల్‌ లో ఒక వీడియోను చేస్తూ అన్న పూర్ణ స్టూడియో లోకి వెళ్తున్నాను.ఇక్కడే ఎన్టీఆర్‌ గారు ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ జరుగుతుంది.

Advertisement

ఇప్పుడు ఆయన ఇక్కడే ఉండి ఉంటారు అంటూ వ్యాఖ్యలు చేశాడు.ఎన్టీఆర్‌ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు అంటూ రవి చెప్పడంతో జెమిని టీవీ వారు మొత్తం షూటింగ్‌ ను ఒకేసారి పూర్తి చేసి ఆ తర్వాత టెలికాస్ట్‌ చేయబోతున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వారం వారం షూటింగ్‌ చేస్తేనే బాగుంటుంది.అలా కాదని మొత్తం ఒకే సారి షూటింగ్‌ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉండక పోవచ్చు అంటున్నారు.

అంటే ఎన్టీఆర్‌ బిజీగా ఉండటం వల్ల పదే పదే షూటింగ్ కు హాజరు అవ్వడం సాధ్యం అయ్యే పని కాదు.అందుకే షూటింగ్‌ ను ఒకే సారి ముగించేలా ప్లాన్‌ చేశారు.

ముందు ముందు ఎన్టీఆర్‌ కు సంబంధించిన ప్రోమోలు విడుదల చేసి టెలికాస్ట్‌ డేట్‌ ను ప్రకటించే అవకాశం ఉంది.ఆగస్టులో టెలికాస్ట్‌ ప్రారంభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఇక ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం ఎన్టీఆర్‌ జార్జియా వెళ్లబోతున్నారు.అప్పటి వరకు సాధ్యం అయినంత వరకు ఎక్కువ ఎపిసోడ్స్‌ ను చిత్రీకరించి ఆ తర్వాత మిగిలిన ఎపిసోడ్స్ చిత్రీకరణ లో పాల్గొంటారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు