గెంతేస్తున్న చరణ్ ఫ్యాన్స్.. మందేస్తున్న తారక్ ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగ పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రాజమౌళి ఎలాంటి విషయంలోనూ రాజీ పడేందకు ఇష్టపడట్లేదు.దీంతో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌ షెడ్యూల్స్ మరింత ఆలస్యం అవుతుండటంతో దీని బడ్జెట్ మరింత ఎక్కవగా అవుతున్నట్లు తెలుస్తోంది.

Ntr And Ram Charan New Looks From Rrr-గెంతేస్తున్న చ�

ఈ సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.అయితే వీరి లుక్స్ విషయంలో ఇప్పటివరకు రెండు హీరోల ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కానీ తాజాగా ఓ ఫ్యాన్‌తో కలిసి ఈ ఇద్దరు హీరోలు దిగిన ఫోటోను చూస్తే అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది.ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్‌ తమ ఫెవరెట్ యాక్టర్ అవతారం చూసి షాక్ అవుతున్నారు.

Advertisement

తారక్‌ను రాజమౌళి చాలా వినూత్నంగా చూపిస్తాడని అనుకున్న ఫ్యా్న్స్‌కు నిరాశే మిగిలైంది.తారక్ మరోసారి బరువు పెంచుకుని ఈ సినిమాలో కనిపిస్తున్నట్లు తాజా ఫోటో చెబుతుంది.

ఏదేమైనా తారక్ ఫోటో మాత్రం ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఆందోళనకు కారణం అయ్యిందనే చెప్పాలి.మరి ఈ లుక్‌లో ఉన్న తారక్‌ను అలాగూ చూపిస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ అయితేగాని తెలియదు.

Advertisement

తాజా వార్తలు