ఎన్టీఆర్‌30 : మార్చి కూడా వదిలేసిన కొరటాలపై ఫ్యాన్స్‌ అసంతృప్తి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొరటాల శివ దర్శకత్వం లోని చిత్రం ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత సంవత్సర కాలంగా ఈ సినిమా అదిగో ఇదిగో అంటూ దర్శకుడు కొరటాల శివ ఊరిస్తూనే ఉన్నాడు.

తన గత చిత్రం ఆచార్య నిరాశ పర్చడంతో ఈ సినిమా విషయంలో కాస్త ఎక్కువగా హోంవర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే సంవత్సరం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే కొరటాల శివ( Koratala Siva ) టైమ్ స్పెండ్‌ చేశాడు.

మార్చి నెలలో ఖచ్చితంగా సినిమా ప్రారంభం అవుతుంది అంటూ ఆ మధ్య ఎన్టీఆర్ కూడా ప్రకటించాడు.కానీ మార్చి నెలలో కేవలం పూజ కార్యక్రమాలకి సరిపోయింది.

రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతాయి అనే కొత్త వాదన వినిపిస్తోంది.అసలు ఇప్పటి వరకు ఎన్టీఆర్( JR ntr ) సినిమా ప్రారంభం కాకపోవడానికి కారణం ఏంటి అంటూ కొరటాల శివను చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

Advertisement

అతి త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కాబోతుంది అంటూ సంవత్సర కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.ఇంతటి వాయిదాలు పడ్డ సినిమా ఎలా ఉంటుందో అనే ఆందోళన ప్రేక్షకుల్లో ఉంది.

అయితే ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఎక్కువగా వెయిట్ చేస్తే అంత ఎక్కువగా బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్ ( Janhvi Kapoor )గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది పూజా కార్యక్రమాల్లో ఆమె అధికారికంగా కనిపించడంతో చిత్ర యూనిట్ సభ్యుల ఆ విషయమై క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఇక ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి అంటూ అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.ఏప్రిల్ నెలలో కచ్చితంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఏప్రిల్ నెలలో కూడా ప్రారంభం కాకపోతే కొరటాల శివ ను తీవ్రంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ విమర్శించే అవకాశం ఉంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు