ఎన్టీఆర్‌ 'వార్‌' కోసం తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌( Young Tiger NTR ) ప్రస్తుతం చేస్తున్న దేవర( Devara ) సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే బాలీవుడ్‌ చిత్రం వార్‌( War ) లో నటించబోతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న వార్‌ సినిమా లో ఎన్టీఆర్‌ పోషించబోతున్న పాత్ర పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హృతిక్‌ రోషన్ హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే.వార్ లో ఎన్టీఆర్‌ విలన్ పాత్ర ను పోషిస్తున్నందుకు గాను ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది.ఈ స్థాయిలో ఆఫర్‌ ను బాలీవుడ్‌( Bollywood ) నుండి దక్కించుకున్న హీరో గతంలో ఎవరు లేరు.

మన సౌత్‌ ఇండియా నుండి ఈ స్థాయిలో భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోగా ఎన్టీఆర్‌ నిలిచాడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.హీరోగా ఎన్టీఆర్‌ వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సమయంలో అనూహ్యంగా వార్‌ కోసం విలన్ పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం విచిత్రంగా విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

ఎన్టీఆర్‌ కి కెరీర్ ఆరంభం నుండి కూడా నెగిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలను చేసేందుకు ఆసక్తిగా ఉంటాడు.అందుకే వార్ లో నటించేందుకు గాను ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అంతే కాకుండా భారీ గా పారితోషికం కూడా లభిస్తోంది.

వార్‌ హిట్ అయితే బాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు.వార్‌ లో విలన్ గా నటించిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమా లో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవర సినిమా పూర్తి అయిన తర్వాత మూడు నెలల పాటు ఎన్టీఆర్ వార్ సినిమా షూట్ లో పాల్గొంటాడు.ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా లో నటించబోతున్నాడు.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?
Advertisement

తాజా వార్తలు