యూకేలో కత్తితో రెచ్చిపోయిన దుండగుడు.. దాడిలో ఎన్నారై టీనేజర్ మృతి..

ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌లో జరిగిన కత్తి దాడిలో భారతీయ సంతతికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి మరణించింది.

గ్రేస్ కుమార్, ఆమె స్నేహితురాలు బర్నాబీ వెబర్‌( Barnaby Webber )తో కలిసి తన స్టూడెంట్ హాస్టల్‌కి తిరిగి వెళుతుండగా ఒక దుండగుడు దాడి చేశాడు.

గాయాలపాలైన వారు చనిపోయే ముందు సహాయం కోసం కేకలు వేశారు.గ్రేస్ ఒక టాలెంటెడ్ హాకీ ప్లేయర్, క్రికెటర్.

ఆమె అండర్-16, అండర్-18 స్క్వాడ్‌లలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.సౌత్‌గేట్ హాకీ క్లబ్, వుడ్‌ఫోర్డ్ వెల్స్ క్రికెట్ క్లబ్‌కు ఆడుతోంది.

గ్రేస్, బర్నాబీ ( Grace Kumar )చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు ఇల్కెస్టన్ రోడ్‌లోని సంఘటనా స్థలానికి రావాలంటూ పోలీసులను పిలిచారు.మంగళవారం తెల్లవారుజామున వీరిద్దరిని ఒక వ్యక్తి దారుణంగా పొడిచి చంపినట్లు సమాచారం.

Advertisement

యూకే పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్న నిందితుడిని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నారు.ఈ 31 ఏళ్ల నిందితుడు ఎన్నారై టీనేజర్‌తో పాటు ఆమె స్నేహితురాలను చంపేశాక తన హింసాత్మక చర్యలను కొనసాగించాడని నాటింగ్‌హామ్‌షైర్ పోలీసులు నివేదించారు.

ఈ నిందితుడు 50 ఏళ్ల వ్యక్తిని కూడా కత్తితో పొడిచి చంపాడు.అంతేకాదు, నిందితుడు బాధితుడి నుంచి వ్యాన్‌ను దొంగిలించి, దానితో ముగ్గురు వ్యక్తులను తొక్కించాలని ప్రయత్నించాడు.ఈ క్రమంలో గాయాల పాలైన ఆ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా పోలీసు అధికారులు సాక్షాధారాలను సేకరించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు./br>

ఈ దారుణ దుర్ఘటనలో చనిపోయిన గ్రేస్ లండన్‌కు చెందిన డాక్టర్ సంజోయ్ కుమార్ ( Dr.Sanjoy Kumar )కూతురు అని తెలుస్తోంది.సంజోయ్ 2009లో తన స్థానిక శస్త్రచికిత్సలో కత్తి దాడిలో గాయపడిన బాధితుల ప్రాణాలను రక్షించిన "హీరో" డాక్టర్‌గా ప్రశంసలు అందుకున్నాడు.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters

ఇకపోతే గ్రేస్ కుమార్ మరణం ఎంతో కలిసి వేసిందని హాకీ టీమ్‌తో పాటు తోటి ప్లేయర్స్ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు