నేడు శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్ల‌ న‌వంబ‌ర్ కోటా విడుద‌ల‌

శ్రీవారి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం న‌వంబ‌ర్ కోటా టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

న‌వంబ‌ర్ నెల‌కు సంబంధించిన ప్ర‌త్య‌క ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల‌తో పాటు ఆర్జిత సేవ‌, అంగ ప్ర‌ద‌క్షిణ టికెట్ల‌ను ఉద‌యం 9 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

అదేవిధంగా న‌వంబ‌ర్ నెల‌లో స్వామివారికి నిర్వ‌హించ‌నున్న క‌ళ్యాణోత్స‌వం, స‌హ‌స్ర దీపాలంకార సేవ‌, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత సేవా టికెట్ల‌ను ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అందుబాటులోకి తీసుకురానుంది.