మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‎కు నోటీసులు

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసుపై నార్కోటిక్ బ్యూరో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా సినీ హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేశారు.

ఈ మేరకు 41 ఏ కింద నవదీప్ కు అధికారులు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ నార్కోటిక్ బ్యూరో అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా మాదాపూర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో ఏ-29 నిందితుడిగా నవదీప్ ఉన్న సంగతి తెలిసిందే.డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని పోలీసుల వైఖరిని తప్పుపడుతూ నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై పోలీసులు రూల్స్ ఫాలో అవ్వాలన్న ధర్మాసనం నవదీప్ ను విచారించాలంటే 41 (ఏ) కింద నోటీసులు ఇవ్వాలని, ఆ తరువాత విచారించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

తాజా వార్తలు