Sonakshi Sinha NBK 108 : NBK108'లో సోనాక్షి సిన్హా.. ఈ వార్తలపై స్పందించిన బ్యూటీ!

బాలీవుడ్ హీరోయిన్ లలో సోనాక్షి సిన్హా ఒకరు.ఈమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారుమోగి పోయింది.ఇక ఈమె ఆ తర్వాత సౌత్ లో రజనీకాంత్ లింగా సినిమాతో పరిచయం అయ్యింది.

దీంతో ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

అయితే ఈమె మరొక సౌత్ మూవీలో నటించ బోతుంది అనే వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి.అది కూడా మన టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య చేయబోయే 108వ సినిమాలో ఈమె నటించ బోతుంది అనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

Advertisement

అయితే ఈమెను మేకర్స్ ఈ సినిమా కోసం ముందు తీసుకుని ఆ తర్వాత మళ్ళీ తప్పించినట్టు కూడా వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది.

సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా స్పందిస్తూ.నన్ను ఎవరు సంప్రదించలేదు.

అలాగే ఎవరు నన్ను తప్పించలేదు.ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా బాలయ్య ప్రెజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.

చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సినిమాలోనే ఈమె నటించ బోతున్నట్టు వార్తలు రాగ ఈమె ఖండించింది.

Advertisement

దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది.ఇక NBK108 సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని.

హీరోయిన్ గా ప్రియమణి అని వార్తలు వస్తున్నాయి.షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.

చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.