అయ్యప్ప భక్తులకు గమనిక.. వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితి తగ్గింపు ఎందుకంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే శబరిమల( Sabarimala ) అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ 80 వేలకు తగ్గించినట్లు దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం బుకింగ్ పరిమితి 90 వేలు కాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి, దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ల సంయుక్త సంప్రదింపుల తర్వాత బుకింగ్ పరిమితిని తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం.

అయితే ముందుగా ఏర్పాటు చేసిన ప్రదేశాలలో అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ వెల్లడించారు.శబరిమల( Sabarimala )కు వచ్చే భక్తుల కోసం నిలక్కల్, పంపా సన్నిధానంలో అన్ని మౌలిక వసతులను కల్పించారు.

అలాగే యాత్రికులు వచ్చే ప్రదేశాలలో బాత్రూం, టాయిలెట్, యూరినల్ సౌకర్యాలు, బయో టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.అక్కడక్కడ తాగు నీటిని పంపిణీ చేస్తూ ఉన్నారు.అలాగే సకాలంలో వైద్యం కూడా అందిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే అయ్యప్ప భక్తుల రద్దీ నీ నియంత్రించేందుకు భక్తులకు సాఫీగా దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు కొట్టాయ్ క్యూ కాంప్లెక్స్ లోని దేవస్థానం బోర్డు ప్రారంభించిన డైనమిక్ క్యూ సిస్టమ్ పూర్తిగా పని చేస్తుంది.ప్రతికూల వాతావరణం లోను డైనమిక్ క్యూ విధానం భక్తులకు( Devotees ) వరంగా మారిందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

Advertisement

గతం కంటే భిన్నంగా భక్తుల రద్దీని నియంత్రించడానికి కొత్త క్యూ విధానం ఎంతగానో ఉపయోగపడిందని ఆలయ అధికారులు చెబుతున్నారు.అలాగే క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులకు బిస్కెట్లు, తాగునీరు సరఫరా చేస్తున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే 18వ మెట్టు పైకి చేరుకున్న భక్తులు అయ్యప్ప ను చక్కగా దర్శించుకోగలుగుతున్నారు.

అలాగే ప్రభుత్వ శాఖల సహకారంతో అయ్యప్ప భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ముందుకు సాగుతుందని దేవస్థానం అధ్యక్షుడు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు