కేసీఆర్ కాదు..ఆ ఇద్దరు మంత్రులే రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ ..!!

కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ముఖ్యమంత్రి అయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు అలాగే అధికారులు కూడా వీరిని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారు.

మరీ ముఖ్యంగా పోలీసులు చేసిన పనికి రేవంత్ రెడ్డి అయితే నేను మీ అందరి పేర్లు డైరీలో రాసుకుంటున్నాను.మేము అధికారంలోకి రావడంతోనే మీ పని ఖతం అన్నట్లుగా మాట్లాడారు.

అయితే చాలామంది రేవంత్ రెడ్డి ఫస్ట్ అధికారంలోకి రావడంతోనే కేసీఆర్ కేటీఆర్( KTR ) చేసిన అవినీతులు బయటికి తీసే పనిలో ఉంటారు అని భావించారు.అయితే రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ కేసీఆర్ లేదా కేటీఆర్ కాదట.

ఆయన ఫస్ట్ టార్గెట్లు ఆ ఇద్దరు మంత్రులే అని తాజాగా మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఇక రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ ఎవరో కాదు ఒకటి ఎర్రబెల్లి దయాకర్ రావు, 2 మంత్రి మల్లారెడ్డిం.వీరిద్దరే రేవంత్ రెడ్డికి మొదటి టార్గెట్ అని తెలుస్తోంది.అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనను ఎర్రబెల్లి దయాకర్ మంత్రి మల్లారెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు.

మరి ముఖ్యంగా టిడిపి ( TDP ) పార్టీలో రేవంత్ రెడ్డి కొనసాగుతున్న సమయంలో ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు వెళ్లారు.అయితే ఈయన జైలుకు వెళ్లడానికి ప్రధాన కారణం ఎర్రబెల్లి దయాకర్ రావే అని చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao ) బీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి పోలీసులకు రేవంత్ రెడ్డి చిక్కేలా ప్లాన్ చేశారట.అంతేకాకుండా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మధ్య కూడా ఎన్నో మాటలు యుద్ధాలు నడిచాయి.

వీరిద్దరూ తొడలు కొట్టుకుంటూ మీడియా ముఖంగా బహిరంగంగానే సవాళ్లు చేసుకున్నారు.అంతేకాదు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కూతురు పెళ్లప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్నారని,ఆ తర్వాత నన్నే తిట్టారు అంటూ ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

అయితే ఓ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో చాలా ఇబ్బంది పెట్టారు అని మల్లారెడ్డి చెప్పారు.అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా సిఎం అయ్యారు.అలాంటి అప్పుడు మల్లారెడ్డి ( Mallareddy ) చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి బయటకు తీస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

ఇక ఇప్పటికే మల్లారెడ్డి పై ఎన్నో అవినీతి, భూ అక్రమణ కేసులు ఉన్నాయి.వీటన్నింటిని రేవంత్ రెడ్డి బయటికి తీసి మల్లారెడ్డి పై కేసులు వేయించే అవకాశం చాలానే కనిపిస్తుంది.

రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లారెడ్డి ఇలా వీరి మీద పగ తీర్చుకున్నాకే కేసీఆర్( KC R) , కేటీఆర్ మీదకి వెళ్తారని తెలుస్తోంది.ఇక ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు లెక్కలన్నీ శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇలా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వారందరిని ఇప్పుడు టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు