నాయిస్ లూనా రింగ్ లో హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లు.. అద్భుతమైన మరెన్నో ఫీచర్లు..!

నాయిస్ లూనా రింగ్( Noise Luna Ring ) తాజాగా భారత మార్కెట్లోకి లాంచ్ అయ్యింది.

ఈ స్మార్ట్ రింగ్ లో హెల్త్ ట్రాకింగ్ సెన్సార్లతో పాటు అద్భుతమైన మరెన్నో ఫీచర్లో ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం.

లూనా స్మార్ట్ రింగ్( Luna Smart Ring ) టైటానియం బాడీతో, డైమండ్ పూతతో ఉంటుంది.ఈ రింగ్ మూడు నుంచి నాలుగు గ్రాముల బరువు కలిగి ఉంటుంది.ఈ రింగ్ 2.8 mm మందం కలిగి ఉంటుంది.ఈ రింగ్ ప్రత్యేకతలు ఏమిటంటే.

హార్ట్ రేట్, శరీర ఉష్ణోగ్రత, SpO2 మానిటర్, స్లీప్, యాక్టివిటీ ట్రాకింగ్ లతోపాటు ఇంకా ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన ట్రాకింగ్ ఫీచర్లు ఈ స్మార్ట్ రింగులో ఉన్నాయి.నాయిస్ ఫిట్ యాప్ ద్వారా ఆరోగ్య ఫలితాలను ట్రాకింగ్ చేయవచ్చు.

స్మార్ట్ రింగ్( Smart Ring ) తక్కువ శక్తిని ఉపయోగించుకొనే టెక్నాలజీని తో వస్తుంది.ఆండ్రాయిడ్ 6+ మరియు iOS 14 తో పాటు ఇతర వెర్షన్లను సపోర్ట్ చేస్తుంది.50 మీటర్ల లోతు నీటి వరకు వాటర్ రెసిస్టెన్స్ ను( Water Resistant ) కలిగి ఉంది.కేవలం 120 నిమిషాలలో ఫుల్ చార్జింగ్ అవుతుంది.

Advertisement

సింగిల్ చార్జింగ్ తో ఆరు రోజులపాటు ఈ స్మార్ట్ రింగ్ ఉపయోగించుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికి వస్తే.ప్రారంభ ధర రూ.14999 గా ఉంది.gonoise.com లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది.

ఇది లూనార్ బ్లాక్, మిడ్ నైట్ బ్లాక్, స్టార్ డస్ట్ సిల్వర్ అనే మూడు రకాల రంగుల్లో లభిస్తుంది.త్వరలోనే రోజ్ గోల్డ్, సన్ లిట్ గోల్డ్ అనే రంగుల్లో కూడా అందుబాటులోకి రానుంది.

స్మార్ట్ రింగును ఆర్డర్ చేశాక.కస్టమర్ చేతి వేళ్ల సైజు ను నిర్ణయించడానికి సైజింగ్ కిట్ వస్తుంది.ఆ తర్వాత నాలుగు వారాల వ్యవధిలో స్మార్ట్ రింగ్ డెలివరీ అవుతుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అంతేకాదు ఈ స్మార్ట్ రింగ్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు