జగన్‌ వల్ల ఏపీకి మాత్రమే కాదు ఇండియాకే డ్యామేజ్‌

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఇండియా బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తింటుంది అంటూ చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించాడు.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న హాస్యాస్పద నిర్ణయాల కారణంగా పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఇప్పుడు ఏపీనే కాదు ఇండియా వైపు చూసేందుకు కూడా సిద్దంగా లేరు అంటూ చంద్రబాబు ఆరోపించాడు.

అనాలోచిత నిర్ణయాలు మరియు విధానాల కారణంగా పలు ఇబ్బందులు వస్తున్నట్లుగా ఈ సందర్బంగా జగన్‌ ఆరోపించాడు.పెద్ద ఎత్తున కంపెనీలు ఏపీని వదిలి పోవడంతో పాటు అంతర్జాతీయ మీడియాలో తీవ్ర ఆక్షేపణలు చేస్తున్నాయి.

ఏపీలో పెట్టుబడికి అనుకూలం కాదని కొందరు, ఇండియాలో రాజకీయాల కారణంగా కోట్లు నష్టపోయామంటూ కొందరు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చారు.ఆ పేపర్‌ కట్టింగ్స్‌ను కూడా చంద్రబాబు నాయుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఇండియా బ్రాండ్‌ పూర్తిగా పడిపోయి ఇన్నాళ్లుగా కొనసాగుతు వస్తున్న బ్రాండ్‌ ఇమేజ్‌ పోతుందని బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు