ఎన్నిసార్లు చెప్పాలి ... ప్రత్యేక హోదా రాదంతే

ఏపీకి ప్రత్యేక హోదా రాదు .రాదు .

రాదు.ఈ సంగతి ఎన్నిసార్లు చెప్పాలి? .ఓ బీజేపీ నాయకుడి వీరంగం ఇది.ఈయన సాదా సీదా నాయకుడు కాదు.సిద్ధార్థ నాథ్ సింగ్ అనే ఈ ఉత్తరాది నాయకుడు ఏపీ బీజేపీకి ఇంచార్జి.

శుక్రవారం ఏపీ బిజేపీ కోర్ కమిటీ సమావేశంలో సింగ్ పాల్గొన్నారు.రాష్ట్ర పార్టీకి ఇంచార్జి కదా.ఇంత పెద్దాయన కనబడితే విలేకరులు ఊరుకుంటారా? ప్రత్యేక హోదా సంగతి ఏమిటి సార్? అని అడిగారు.అంతే .సింగుకు చిర్రెత్తుకొచ్చింది.ఎన్నిసార్లు చెప్పాలయ్యా హోదా రాదని అని మండిపడటమే కాకుండా చిల్లర రాజకీయాలు మానుకోండి అని సలహా ఇచ్చారు.

ఇప్పటికే పదకొండు రాష్ట్రాలకు హోదా ఉందని, ఎపీని పన్నెండో రాష్ట్రంగా ఆ జాబితాలో చేర్చబోమని చెప్పారు.ఈ మధ్యనే ఇద్దరు కేంద్ర మంత్రులు హోదా ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.

Advertisement

అయినా సీఎం హోదా కోసం ధిల్లీ వెళుతున్నానని, దాన్ని సాధిస్తామని చెప్పారు.ఇంకా ఆశలు పెట్టుకోవడం అవసరమా ?.

Advertisement