నితిన్ 'మాస్ట్రో' నుండి ''వెన్నెల్లో ఆడపిల్ల'' సాంగ్ !

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త సినిమా మాస్ట్రో.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంటే తమన్నా కీలక పాత్రలో కనిపిస్తుంది.

బాలీవుడ్ లో టబూ చేసిన రోల్ లో తమన్నా కనిపించే బోతుంది.తమన్నా ఈ సినిమాలో యాక్టింగ్ కుమ్మేసిందని ఇప్పటికే వార్తలు వినిపించాయి.

Advertisement
Nithin Maestro Movie Song Released, Nithin, Maestro, Final Schedule, Hyderabad ,

ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.క్రైం త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ అంధుడి పాత్రలో కనిపించ బోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను మెప్పించాయి.తాజాగా ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేసారు.

మాస్ట్రో మ్యూజిక్ ఫస్ట్ లో భాగంగా వెన్నెల్లో ఆడపిల్ల అనే సాంగ్ ప్రోమో వీడియోను విడుదల చేసారు.వినడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్న ఈ పాట ప్రోమో కూడా చాలా అందంగా ఉంది.

ఈ సాంగ్ లో నితిన్ నభా నటేష్ కెమిస్ట్రీ బాగా కుదిరించి.

Nithin Maestro Movie Song Released, Nithin, Maestro, Final Schedule, Hyderabad ,
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

అనగనగా అందమైన కథగా మొదలైన ఈ పాట వినడానికి బాగుండడంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.ఫుల్ సాంగ్ ఆగస్టు 6 న విడుదల చేయబోతున్నారు.నితిన్ గత సినిమా రంగ్ దే విడుదల అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో నితిన్ నిరాశ చెందాడు.

Advertisement

అందుకే నితిన్ ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నాడు.మరి చూడాలి ఈ సినిమా నితిన్ కెరీర్ కు ఎంత ఉపయోగ పడుతుందో.

తాజా వార్తలు