అభిమానులను, ప్రేక్షకులను కన్ఫ్యూజ్‌ చేస్తున్న నితిన్‌

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్‌ దే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు దర్శకుడు ఇటీవలే ప్రకటించాడు.

నితిన్‌ తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ అంధధూన్ లో రీమేక్ లో నటించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని నితిన్‌ ప్రస్తుతం అంధాదున్‌ రీమేక్ లో కాకుండా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చెక్‌ సినిమాలో నటిస్తున్నాడు.

Nithin And Priya Prakash Varrier New Movie Check Shooting Start Nithina, Priya

నేటి నుంచి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు గా నితిన్ స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.అంధాదున్‌ రీమేక్‌ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ గత ఆరు నెలలుగా జరుగుతుంది.

అయినా ఉన్నట్టుండి చెక్‌ సినిమా షూటింగ్ ను ప్రారంభించడం ఏంటా అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అంధాదున్‌ రీమేక్‌ కు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదున్‌ తెలుగులో నితిన్ చేస్తే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ అవాక్కయ్యేలా చెక్ సినిమా షూటింగులో పాల్గొనడం చర్చనీయాంశం అయ్యింది.

రంగ్‌ దే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే చెక్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వడానికి ఉద్దేశం ఏంటి అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.రంగ్‌ దే సినిమా షూటింగు విదేశాల్లో జరపాల్సి ఉంది.

అక్కడ హడావుడిగా షూటింగ్ పూర్తి చేసినా కూడా వెంటనే విడుదలకు చాన్స్ లేదు.కనుక వచ్చే ఏడాది ఆరంభంలో ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్న నితిన్‌ ఈలోపు చెక్‌ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ మేజర్ పార్ట్ పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్ హిట్‌ మూవీ అంధాదున్‌ రీమేక్ లో నితిన్ నటించిన అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు