తండ్రి సాధారణ రైతు.. కొడుకు జేఈఈ మెయిన్స్ టాపర్.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే మాత్రమే కెరీర్ అద్భుతంగా ఉంటుంది.

కొన్నిరోజుల క్రితం జేఈఈ మెయిన్స్ ( JEE Mains )2024 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ ఫలితాలలో ఎక్కువగా పేదింటి బిడ్డలు సత్తా చాటి వార్తల్లో నిలిచారు.పేదరికంతో పోరాడుతూనే చాలామంది మంచి ర్యాంక్ లు సాధించారు.

జేఈఈ మెయిన్స్ లో 100 శాతం మార్కులతో నీలకృష్ణ గజరే ( Nilakrishna Gajare )టాపర్ గా నిలిచారు.మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు బిడ్డ అయిన నీలకృష్ణ గజరే ఎంతో కష్టపడి తన కలను నెరవేర్చుకున్నారు.

మహారాష్ట్ర రాష్ట్రంలోని వాసీం పరిధిలోని బెల్ ఖేడ్( Bell Khed ) కు చెందిన నీలకృష్ణ గజరే తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదివారు.అకోలాలో ఉన్న రాజేశ్వర్ కాన్వెంట్ స్కూల్ ( Rajeshwar Convent School in Akola )లో చదువుకున్న నీలకృష్ణ బంధువుల దగ్గర ఉండి హైస్కూల్ చదువు చదువుకున్నారు.

Advertisement

ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచి చదువుకునేవాడని రాత్రి 10 గంటలకు పడుకునే వాడని తల్లీదండ్రులు చెబుతున్నారు.తండ్రి నిర్మల్ మాట్లాడుతూ తమ కొడుకుకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు.చదువులోనే కాదని ఆర్చరీ, మరికొన్ని క్రీడల్లో సైతం తమ కొడుకు నిష్ణాతుడని అతని తల్లీదండ్రులు చెబుతుండటం గమనార్హం.

భవిష్యత్తులో నీల కృష్ణ శాస్త్రవేత్త కావాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.ఐఐటీ బాంబేలో చదవాలని నీలకృష్ణ కోరిక కాగా ఆ కోరిక సులువుగానే నెరవేరుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రెండు సంవత్సరాల పాటు కష్టపడి పిన్నెల్లి ప్రిపేర్ అయ్యాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నీలకృష్ణ హజారే భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నీలకృష్ణ టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

వైరల్ వీడియో : కారులో రొమాన్స్ తో రెచ్చిపోయిన జంట..
Advertisement

తాజా వార్తలు