బయట ఉన్నప్పుడు చాటింగ్ లో మునిగిపోకండి.. నాలా అయిపోతారు: నటి కామెంట్స్ వైరల్?

కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి నికితా దత్త వాకింగ్ చేస్తుండగా ఆమెపై కొందరు దుండగులు దాడి చేసి సెల్ ఫోన్ ని లాక్కెళ్లిన విషయం తెలిసిందే.

ఈ విషయం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

అయితే అప్పుడు పోయిన సెల్ ఫోన్ ఇప్పటివరకు తనకు దొరకలేదని తెలిపింది నికితా.ఆ ఘటన జరిగిన రోజు రాత్రి తాను అసలు నిద్రపోలేదని తెలిపింది.

అయితే తాజాగా ఈ విషయంపై ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది నికితా దత్త.ఇంటర్వ్యూలో నికితా దత్తా మాట్లాడుతూ.

ఆ రోజు జరిగిన ఘటన నిజంగా చాలా భయంకరం.నాకు నా ఫోన్‌ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది.

Advertisement

ఆ ఘటనతో ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది.కానీ సాధారణ వాకింగ్‌ చేయడం అంటే నాకిష్టం.

కానీ నాకు అలా జరిగిన తరువాత ధైర్యం చేసి వెళ్లలేక పోతున్నాను.నేను ఇప్పట్లో బయటకు వెళ్లలేను.

అలా వెళ్ళాలి అనీ కూడా నాకు అనిపించడం లేదు అనీ చెప్పుకొచ్చింది.అలాగే నా లైఫ్ లో జరిగిన ఈ భయంకర సంఘటనను పీడకలగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.

మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను.రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరితో చాటింగ్ చేయవద్దు, మెసేజ్ చేస్తూ ఫోన్ లో మునిగిపోవద్దు ఎందుకు అంటే నాకు జరిగిన సంఘటన మీకు కూడా జరగవచ్చు అంటూ సలహా ఇచ్చింది నికిత దత్త.నికితా దత్తా డైబుక్‌, ఏక్‌డుజ్‌కే వాస్తే, ది బిగ్‌బుల్‌, కబీర్‌ సింగ్‌ లాంటి సినిమా లలో నటించింది.2012 లో జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా ఫైనల్‌ వరకూ చేరింది ఈ బ్యూటీ.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు